ఇంకా కొన్ని నెలలే బ్రతుకుతాను అంటున్న టాప్ నటుడు..షాక్ లో అభిమానులు..

549

మనం అన్నిటికన్నా ఎక్కువగా భయపడేది దేనికి అంటే చావుకే అనే చెప్పుకోవాలి.మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు.కానీ ఏదైనా పెద్ద రోగం వస్తే ఇంకా ఎన్ని రోజులు బతుకుతామో డాక్టర్స్ చెప్పేస్తారు.ఇప్పుడు ఒక టాప్ నటుడుకి కూడా ఇదే పరిస్థితి వచ్చింది.తొందర్లోనే చనిపొతావు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ విషయాన్నీ కాస్త అభిమానులకు తెలియజేశాడు.మరి ఆ నటుడు ఎవరో అతనికి వచ్చిన రోగం ఏమిటో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for irrfan khan cancer

బాలీవుడ్ మంచి నటుల లిస్టు లో ఖచ్చితంగా ఉండే పేరు ఇర్ఫాన్ ఖాన్.ఆయన పోషించిన పాత్రలు సినిమాకే అందాన్ని తీసుకొస్తాయి.ఒక్క ఇండియన్ సినిమాలోనే కాదు హాలీవుడ్ బ్రిటిష్ సినిమాలలో కూడా నటించాడు.కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా చేశాడు.అయితే ఇప్పుడు ఈయన కొన్ని ఆవేదనాపూరిత వ్యాఖ్యలు చేశారు. తాను గత కొంత కాలంగా న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.

Image result for irrfan khan cancer

ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ గుండెలు పగిలే వార్త చెప్పాడు. తాను బతికేది మరికొన్ని నెలలు మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది. కొన్ని నెలలు, లేదంటే ఏడాది.. మహా అయితే రెండేళ్లు బతుకుతాను కావచ్చు.కానీ చావు కళ్ళ ముందు వుందని నిరుత్సాహపడి ఉన్న ఈ కొద్ది సమయాన్ని విషాదంగా మార్చుకోవడం కరెక్ట్ కాదేమో. అందుకే ఇలాంటి నిరుత్సాహ మాటలు ఇకనుంచి మాట్లాడను. ఉన్న ఈ కొద్ది సమయాన్ని ఆనందంగా గడుపుతాను’ అని ఆవేదనగా చెప్పాడు.

ఈ అనుభవంతో తనకు జీవితంపై స్పష్టమైన అవగాహన వచ్చిందని ఇర్ఫాన్ వివరించాడు. ప్రస్తుతం తాను జీవితాన్ని మరో కోణం లోంచి చూస్తున్నాను. ప్రస్తుతం కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, మొత్తం ఆరు జరగాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆరు సైకిళ్లు పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఆ తర్వాత మాత్రమే ఏం చేయాలనేది తెలుస్తుందన్నాడు. ఇర్ఫాన్ ఆరోగ్యం విషయంలో అతని ఫ్యాన్స్ అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.మనం కూడా ఆయనకు ఏమి కాకుండా ఉండాలని కోరుకుందాం.మరి ఇర్ఫాన్ ఖాన్ గురించి ఆయనకు వచ్చిన ఈ వ్యాధి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

బిసి ఓటు బ్యాంకుపై బిజెపి కన్ను…టిడిపి కి షాక్..