తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు కి ఆర్దిక సహాయం చెయ్యాలనుకుంటే ఈ అకౌంట్ కి పంపవచ్చు ..అందరికి షేర్ చేయండి

1191

సినిమా రంగంలో గొప్పగా బ్రతికి చివరికి ఏమి లేకుండా అయిపోయినవారు ఎంతో మంది ఉన్నారు. ఎస్.వి.రంగారావు , సావిత్రి, కాంతారావు , రాజబాబు, సూర్యకాంతం లాంటి వాలు సంపాదించిందంతా దాన దర్మాల పేరుతో పొగొట్టుకుని చివరి నిమిషంలో పైసా లేకుండా దీనావస్థలో పోయిన వారే.

కావాలంటే ఈ వీడియో చూడండి

గుండు హనుమంతురావుగారి పరిస్థితి కూడా ఇప్పుడు అదే.ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మనల్ని మెప్పించారు గుండు హనుమంతురావు. అమృతం సీరియల్లో అంజి క్యారెక్టర్లో కూడా మనల్ని అలరించారు. తన నటనతో బాగానే సంపాదించారు. తన భార్య,కూతురు చనిపోవడంతో కొద్దిగా మానసికంగా కృంగిపోయిన హనుమంతురావు తన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారు..

అప్పటికే సంపాదించిందంతా కొడుకు విదేశాల్లో చదువుకి వినియోగిన్చేశారు. ఇంతలో హనుమంతరావు గారికి ఆరోగ్యం దెబ్బతినడం తో చూసేవారు ఎవరు లేక కొడుకు విదేశాల నుండి విదేశాల నుండి వచ్చి తండ్రి దగ్గరే ఉంటూ తండ్రిని చూసుకుంటున్నాడు. అటు కొడుకు ఉద్యోగం పోయింది. ఇటు హనుమంతరావు గారు కిడ్నీ వ్యాదిన పడ్డారు. చేతిలో డబ్బులకు కష్టంగా ఉన్నారు. అయినా ఎవ్వరికీ చెప్పుకోలేదు.

మొట్టమొదటగా ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా ఇటీవల ఆలి యాంకర్ గా వస్తున్న ఒక ప్రోగ్రామ్ లో చెప్పారు. దీంతో చలించిపోయిన ఆలీ గుండు హనుమంతురావు కొడుక్కి ఉద్యోగం ఇప్పించడమే కాదు. తన ఆరోగ్యానికి అవసరమైన వైధ్య ఖర్చులు భరిస్తానని మాటిచ్చారు. ఒకప్పుడు తోటి నటుడి పట్ల ఆలి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీన‌టులు గుండు హ‌నుమంత‌రావుకు మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం అందించారు… తన సరదా చేష్టలతో, అమాయకత్వపు హావభావాలతో ఎంతో మందిని నవ్వించిన హాస్య‌నటులు గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఆ సంఘటన మెగాస్టార్ చిరంజీవి కంటపడటంతో గుండు హ‌నుమంత‌రావుకు రూ.2ల‌క్ష‌ల చెక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చెక్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా అంద‌జేశారు.

అలాగే ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులు పెద్దలు సినీ పెద్దలు గుండు హనుమంతరావు గారికి ఆర్ధిక సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు, అంతే కాక పలువురు తమకు పెద్ద సంఖ్యలో ఫోన్ లు చేస్తున్నట్టు చెప్పారు ఆలి, ఈ నేపధ్యం లో ఎవరైనా ఆయనకు సహాయాన్ని అందించాలని అనుకున్నవారు ఆయన అకౌంట్ లో వేయవచ్చని చెప్పుకొచ్చారు…
అయన అకౌంట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి….

Gundu hanumantha Rao, A/c 1451 155 1723
Karur Vysya Bank Jubliee Hills Branch
IFSC: KVBL0001451 అని చెప్పుకొచ్చారు…ఎవరైనా తాము విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ అకౌంట్ కి పంపిచ్చవచ్చని చెప్పారు అలీ…సరైన సమయం లో తగిన విధంగా స్పందించినందుకు అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు నెటిజన్లు..