రూ. 1000 సాయం చెయ్యండి.. ‘నా పేరు సూర్య’ జీప్ గెలుచుకొండి

416

మీకు నా పేరు సూర్య సినిమా టీమ్ ను కలుసుకోవాలని ఉందా..ఆ సినిమాలో అల్లు అర్జున వాడిన జీప్ ను గెలుచుకోవాలని ఉందా..అయితే మీకోసమే ఆ చిత్ర యూనిట్ ఒక కాంపిటీషన్ పెట్టింది.కేరళ వరద బాధితులకు సహాయం చేసేందుకు వివిధ మార్గాల్లో పలు సంస్థలు విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య’ చిత్ర బృందం కేరళ బాధితులను ఆదుకునేందుకు వినూత్నమైన కాంటెస్ట్‌కు శ్రీకారం చుట్టింది.

Win Naa Peru Surya Jeep through Donate for Kerala with NPS Jeep Contest

కేరళ బాధితులకు రూ. 1000 సహాయం చేయడం ద్వారా ఈ చిత్రంలో హీరో ఉపయోగించిన జీప్ గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు.మహింద్రా కంపెనీకి చెందిన థార్ జీప్‌ను ‘నా పేరు సూర్య’ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. 2.5 లీటర్స్ సిడిఆర్ఇ ఇంజిన్ కలిగిన ఈ స్టోర్ట్స్ జీప్ 105 హార్స్ ఫవర్, 247ఎన్ఎం టార్క్ శక్తిని కలిగి ఉంది.ఈ కాస్టెంటులో పాల్గొనాలనుకునే వారు https://www.starobe.com/naaperusurya సందర్శించి కేరళ సహాయ నిధికి కనీసం రూ. 1000 విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అలా డొనేట్ చేసిన వారిలో లక్కీ విన్నర్స్‌ను ఎంపిక చేసి వారికి జీప్ బహూకరించనున్నారు.

Win Naa Peru Surya Jeep through Donate for Kerala with NPS Jeep Contest

రూ. 1000 ఎన్ని ఎక్కువ సార్లు డొనేట్ చేస్తే జీప్ గెలుచుకునే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుందని కాంటెస్ట్ నిర్వాహకులు తెలిపారు.విరాళం అందించిన వారికి కాంప్లిమెంటరీ గిఫ్టుగా నా పేరు సూర్యలో అల్లు అర్జున్ ధరించిన టీ షర్టు పంపించనున్నారు. దీంతో పాటు పది మంది లక్కీ విన్నర్స్‌కు నా పేరు సూర్య టీంను కలిసే అవకాశం కల్పించనున్నారు.