జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన హీరోయిన్..

503

బిగ్‌ బాస్‌ 11 మాజీ కంటెస్టెంట్‌ హీనా ఖాన్‌ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటారు.హీనా ఖాన్‌ మ్యూజిక్‌ వీడియో ‘భసూది’యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.బిగ్‌ బాస్‌ హౌస్‌లో ‘మిస్‌ రైట్‌’గా పిలుచుకునే హీనా ఖాన్‌ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త హల్చల్ చేస్తుంది.

ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్‌, ప్రకటన షూటింగ్‌ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్‌ నోటీసులు కూడా పంపారట.ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు.తనకు ఎలాంటి లీగల్‌ నోటీసులు రాలేదని తెలిపారు.

అనంతరం తన ట్విటర్‌లో లీగల్‌ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు పన్నిన ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి అంటూ ట్వీట్‌ చేశారు.