తండ్రి మరణ వార్త విన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఏం చేసారో చూస్తే కన్నీళ్లు ఆగవు

457

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

అయితే తండ్రి మరణ వార్త విన్న వెంటనే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు..ఈ ప్రమాదం తెల్లవారు జామున 4 గంటల సమయంలో జరిగింది.అయితే ఆ సమయంలో అందరు నిద్రపోయారు.అయితే తెల్లవారు జమున జాకింగ్ కోసం అని లేచిన ఎన్టీఆర్ కు ఒక ఫోన్ వచ్చింది.ఆ ఫోన్ లో మీ నాన్న చనిపోయాడు అని చెప్పారు.ఆ వార్త విన్న వెంటనే ఎన్టీఆర్ గుండె పగిలేటట్టు ఏడ్చాడు.కొంచెం సేపు ఇది కలా నిజమా అన్న ఆలోచనలో ఎన్టీఆర్ ఉండిపోయాడు.వెంటనే తేరుకుని ఈ విషయం తన భార్య అయిన లక్ష్మి ప్రనతికి ఈ విషయం చెప్పాడు.నిద్రలో ఉన్న లక్ష్మి ప్రణతి ఒక్కసారిగా కంగుతిన్నది.వెంటనే తన తల్లి గదికి వెళ్లి జరిగిన విషయం చెప్పి గుండెలు పగిలేలా ఏడ్చారు.తల్లిని ఓదార్చలేక ఎన్టీఆర్ అతని భార్య చాలా కష్టపడ్డాడు.వెంటనే తన అన్న కళ్యాణ్ రామ్ కు ఫోన్ చేసి చెప్పాడు.

ఈ చేదు వార్త విన్న వెంటనే కళ్యాణ్ రామ్ కూడా దిగ్బంతి చెందాడు.ఒక్కసారిగా ఎన్టీఆర్ ఏం చెప్తున్నాడో కళ్యాణ్ రామ్ కు అర్థం కాలేదు.తెల్లవారు జామున కాబట్టి ఇది కలనేమో అని అనుకున్నాడు.కానీ ఇది నిజమే అని తెలిసి గుండెలు పిక్కలిల్లెలా అరిచాడు.వెంటనే తన తల్లిని నిద్రలేపి జరిగిన విషయం చెప్పాడు.ఆమెను ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాలేదు.వెంటనే ఎన్టీఆర్ స్వగృహానికి చేరుకున్నాడు.తన తండ్రి శవాన్ని హైదరాబాద్ తీసుకొస్తున్నారని తెలిసి ఇక ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయారు.తన అన్న మరణాన్ని ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాం.ఇప్పుడు తండ్రి కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ విషయం తెలిసిన నందమూరి కుటుంబం కూడా తట్టుకోలేకపోతున్నారు.అందరు కలిసి మాసాబ్ ట్యాంక్ లో ఉన్న హరికృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నారు.మనం కూడా కామెంట్ రూపంలో ఆయన మృతికి నివాళి అర్పిద్దాం.మరి ఈయన మరణం గురించి అలాగే నందమూరి వంశస్తులు ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ లో చనిపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.