హ‌రికృష్ణ డ్రైవింగ్ గురించి ప్ర‌త్య‌క్షసాక్షి చెప్పింది వింటే షాక‌వుతారు

513

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం.అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు.అయితే ఈ యాక్సిడెంట్ ను ఒక వ్యక్తి చూశాడు.

Image result for harikrishna nandamuri car accident images

ఆ సమయంలో అసలు ఏం జరిగిందో పూసకు గుచ్చినట్టు చెప్పాడు.మరి ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో చూద్దామా.ప్రమాదం జరిగిన స్థలానికి మా ఇంటికి దగ్గర దూరమే ఉంటుంది.అయితే తెల్లవారు జామున పాల కోసం అని వెళ్తూన్న సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది.ఏమో జరిగిందని రోడు వైపుకు చూసేసరికి ఒక పెద్ద కారు పల్టీలు కొడుతూ ఒకవైపు నుంచి మరోకవైపుకు వెళ్ళింది.అయితే ఏదో యాక్సిడెంట్ జరిగిందని తెలిసి అక్కడికి వెళ్ళాం.వెళ్లి చూస్తే రోడుకు అవతలివైపు కారు ఉంది కానీ కారులో మనిషి లేడు.నేను వెళ్ళిన రెండు మూడు నిమిషాలలోనే మా గ్రామా ప్రజలందరూ ఆ స్థలానికి చేరుకున్నారు. వెంటనే 108 కు ఫోన్ చేశాం.పోలీసులకు సమాచారం అందించాం.

 

అయితే కారు కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడం లేదని అందరం కలిసి వెతికితే ఒక ముళ్ళ పొదల్లో ఆయన మృతదేహం కనిపించింది.అయితే తెల్లవారు జామున కొంచెం చీకటి ఉండడంతో అది హరికృష్ణ మృతదేహం అని మేము అనుకోలేదు.వేరే ఎవరిదో అనుకున్నాం.కానీ పోలీసులు వచ్చి చూస్తే అప్పుడు తెలిసింది అది హరికృష్ణ గారే అని.పోలీసులు వచ్చిన నిమిషం లోపే అంబులెన్స్ కూడా రావడంతో వెంటనే ఆయన బాడీని నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు.

Image result for harikrishna nandamuri car accident images

 

కానీ అప్పటికే సమయం ఎక్కువ కావడంతో ఆయన చనిపోయారు.స్పాట్ లోనే చనిపోయాడని డాక్టర్స్ చెప్పారు.అయితే ఇంతపెద్ద ప్రమాదం జరగడానికి కారణం అతివేగమే అని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.ఎదురుగా ఏమి రాలేదు.అతివేగం వలనే కారు కంట్రోల్ కాకా డివైడర్ ను డీ కొట్టి రోడుకు అవతలి వైపున వెళ్తున్న మరొక కారును డీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.