హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరొక ప్రయోగానికి సిద్దమైన వరుణ్ తేజ్..

174

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ గా పిలవబడుతున్న ఈ యంగ్ హీరో అన్ని ప్రయోగ సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటికే కంచె అంతరిక్షం వంటి ప్రయోగాలతో పాటు ముకుంద, ఫిదా,తొలిప్రేమ, ఎఫ్2 వంటి కమర్షియల్ సినిమాలు కూడా తీస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటుచేసుకున్నాడు.

Related image

అయితే ఇప్పుడు మరొక ప్రయోగం చెయ్యబోతున్నాడు. వరుణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌ లో నటించబోతున్నాడు.కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్‌ గా పేరుపొందిన హరీష్ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

Image result for varun tej harish shankar

ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఒరిజినల్‌ వర్షన్‌లో సిద్ధార్థ్‌ చేసిన పాత్రలో వరుణ్ నటింస్తున్నాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 27న ప్రారంభించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.