బాధ‌తో హ‌రీష్ శంక‌ర్ ట్వీట్

546

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ తో మంచి స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్.. కాని ఆయ‌న‌కు త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు క‌లిసి రాలేదు అనే చెప్పాలి.. కాగా ప్రస్తుతం హరీష్ దిల్ రాజుకు ఓ కథ చెప్పారు. గతంలో హరీష్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో రామ‌య్య వ‌స్తావ‌య్యా, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌’ సినిమాలు వచ్చాయి. ఆ అనుబంధంతో హ‌రీష్ చేయాలనుకుంటున్న మ‌ల్టీస్టార‌ర్ కు దిల్ రాజే నిర్మాత‌గా ఉన్నారు.

Image result for harish shankar

కాగా ప్ర‌స్తుతం దిల్ రాజు తన బ్యానర్ లో ఐదు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ చిత్రాల రిలీజ్ డేట్లును తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. దీంతో దిల్ రాజు సినిమాల‌తో చాలా బిజీగా ఉన్నారు అనేది అర్ధం అవుతోంది..రాజ్‌త‌రుణ్ ల‌వ‌ర్ ఈ నెల 20న రిలీజ్ అవుతుంటే, నితిన్ శ్రీనివాస క‌ల్యాణం ఆగ‌స్టు 9వ తేదీన‌, హ‌లో గురు ప్రేమ కోస‌మే అక్టోబ‌ర్ 18వ తేదీన రిలీజ్ అవబోతున్నాయని దిల్ రాజు నిర్మాణ సంస్థ తెలిపింది… ఇక మిగిలిన సినిమాలు కూడా వ‌ర్క్ జ‌రుపుకుంటున్నాయి. అలాగే మ‌రో రెండు బిగ్ ప్రాజెక్టులు వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్నారు….సంక్రాంతికి వెంక‌టేష్‌, వ‌రుణ్ ఎఫ్‌2, ఏప్రిల్ 5న మ‌హేష్ బాబు 25వ చిత్రం రిలీజ్ కానున్నాయి.

Image result for harish shankar

ఇక ఈ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ దిల్ రాజు టీం అనౌన్స్ చేసిన సినిమాల ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ.. త‌న సినిమా మిస్ అయింది అని చెప్పాడు..కొన్నిసార్లు కొన్ని త‌ప్ప‌వు. ఈ ఐదు చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ లో తెలియ‌చేశాడు.