తాను నడిపిన రథంపైనే హరికృష్ణ అంతిమయాత్ర.. కుటుంబసభ్యుల షాకింగ్ నిర్ణయం

436

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకొచ్చారు..అంబులెన్స్ లో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు కొడాలి నాని,త్రివిక్రమ్ ఉన్నారు.బాలకృష్ణ ముందు ఒక కారులో వచ్చారు.మాసాబ్ ట్యాంక్ లో ఉన్న హరికృష్ణ ఇంటికి మృతదేహం చేరింది.ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.ఇక తర్వాతి కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఆయన అంతిమయాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తను మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for hari krishna dead body

హరికృష్ణ అంతిమయాత్రకు ఆయన కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అయితే హరికృష్ణ పార్ధివదేహాన్ని చైతన్య రథంపై అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన అంతిమయాత్ర చైతన్యరథంపై జరుగనుంది.చైతన్యరథానికి ఎన్టీఆర్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. 1982లో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Image result for hari krishna dead body

దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు. ఈ వాహనంపై ఏపీ అంతా కలియతిరిగారు. దాదాపు ఓ ఏడాది పాటు రాష్ట్రాన్ని చుట్టేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టించారు.అనంతరం హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్యరథంపై తన ఎన్నికల ప్రచారం చేశారు. అచ్చం ఎన్టీఆర్ లాగే కాకి చొక్కా, ప్యాంట్ వేసుకుని ప్రచారం చేశారు. అలాగే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా అచ్చం తాతాగారి లాగనే చైతన్యరధంపై ఎన్నికలు ప్రచారం చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నందమూరి కుటుంబానికి చెందిన మూడు తరాలు చైతన్యరథంపై ప్రచారం చేశాయి. ఇప్పుడు హరికృష్ణ అంతిమయాత్ర కూడా చైతన్యరథంపై నిర్వహించడం సముచితంగా ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు.రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఆయన అంతిమయాత్రకు వినియోగిస్తున్న చైతన్య రథం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.