బాబు నాన్న చనిపోయారు… అని తారక్ కి ఏడుస్తూ చెప్పిన తొలి వ్యక్తి ఎవరంటే?

417

పెళ్లి వేడుక‌కు వెళుతూ అనంత‌లోకాల‌కు, తిరిగిరాని ప్రాంతానికి చేరిపోయారు నంద‌మూరి హ‌రికృష్ణ‌… ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి కుటుంబాన్ని తీవ్ర విచారంలో ముంచెత్తింది…ఇటు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హాప్ర‌స్ధానంలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది… నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగిం‍ది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆ స‌మ‌యంలో వెంట‌నే చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో త‌ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యి మృతిచెందారు. ముందుగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే 108 కి ఫోన్ చేసినా ఆ స‌మ‌యంలో ఉద్యోగులు స‌మ్మెలో ఉండ‌టంతో 108 స‌ర్వీసు అందుబాటులో లేకుండా పోయింది.

Image result for harikrishna

దీంతో ద‌గ్గ‌ర్లోని కారులో ఆయ‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు స్నేహితులు కూడా కారులో ప్ర‌యాణం చేశారు..నంద‌మూరి కుటుంబానికి హరికృష్ణ గారి మరణవార్త చెప్పడానికి ముందు సంశయించారంట. ఆక్సిడెంట్ జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆయన మరణించడంతో ఒక్కసారిగా ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆయన బంధువు వెంకట రావు, శివాజీ షాక్ కు గురయ్యారు. వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంకట రావు గారే మొదట హరికృష్ణ సతీమణి కళ్యాణ్ రామ్ తల్లికి ఫోన్ చేసి ఆక్సిడెంట్ అయిన విషయం మాత్రమే చెప్పారు. కానీ మరణించిన విషయం చెప్పలేదు.

Image result for harikrishna

ఆ తర్వాత తారక్ కి ఫోన్ చేసి, బాబు నాన్న కు ఆక్సిడెంట్ అయ్యింది… హాస్పిటల్ కి తీసుకొచ్చే లోపే చనిపోయారు అని ఏడుస్తూ చెప్పారంట. వెంటనే తారక్, కళ్యాణ్ రామ్ నార్కెట్పల్లికి బయల్దేరి వెళ్లారు.మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్‌ 2) తన పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ ఇలా అర్థాంతరంగా మృతిచెందటంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇక నంద‌మూరి కుటుంబం అశ్రున‌య‌నాల‌తో ఆయ‌న అంతిమ‌సంస్కారాలు చేశారు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రోడ్డు ప్ర‌మాదాలు త‌మ కుటుంబానికి శాపంగా మారాయి అని వారు కుమిలిపోతున్నారు నాలుగు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఇంట్లో రెండు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం అది ఒకే రోడ్డుపై జ‌ర‌గ‌డంతో వారు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.. ఎన్టీఆర్ వార‌సుడిగా నంద‌మూరి వంశోద్దార‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయాల్లో సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న నంద‌మూరి హ‌రికృష్ణ ఇక లేరు అనేమాట విన‌డానికి కూడా మ‌దిని తొలిచేస్తోంది. ఇక నంద‌మూరి కుటుంబానికి ఇది తీర‌ని వేద‌న అనే చెప్పాలి.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.