హరికృష్ణ మరణ వార్త తెలియక మొదటి భార్య లక్ష్మి పూజ గదిలో ఏం చేసిందో తెలుసా?

338

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.అయితే ఆయన మరణ వార్త ఆయన మొదటి భార్య అయిన లక్ష్మికి తెలియదంట.భర్త మరణం గురించి తెలియని ఆమె ఏం చేస్తుందో తెలుసా..చెబుతా వినండి.

Image result for hari krishna wife

హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.హరికృష్ణ మరణం అటు రాజకీయ నాయకులను ఇటు సినీ ప్రముఖులను కలచివేస్తుంది.చాలా మంది ప్రముఖులు హరికృష్ణ నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియగానే ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ,సోదరుడు బాలకృష్ణ హుటాహుటిన నార్కెట్ పల్లి బయల్దేరి వెళ్లారు.ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.అంబులెన్స్ కూడా బయలుదేరింది.అంబులెన్స్ లో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాలకృష్ణ,త్రివిక్రమ్ ఉన్నారు.ఇంకొక 2 గంటలలో ఆయన మృతదేహం హైదరాబాద్ చేరుకోనుంది.ఈరోజు మొత్తం ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Image result for hari krishna wife

 

ఈ విషయాలన్నీ ఇలా ఉంటె హరికృష్ణ మరణం వల్ల ఆయన ఇంట్లో విషాద చాయలు అలుముకుంటే ఇప్పుడు బయటపడ్డ మరోకవర్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఆ విషయం ఏమిటి అంటే..హరికృష్ణ చనిపోయినట్టు ఆయన మొదటి భార్య అయిన లక్ష్మికి తెలియలేదంట.చనిపోయినట్టు ఎవరు చెప్పలేదంట.కేవలం ప్రమాదం అయ్యిందని హాస్పిటల్ లో గాయాలతో ఉన్నాడనే చెప్పారంట.కళ్యాణ్ రామ్ కు చనిపోయాడని తెలిసి ఈ విషయం తన తల్లికి చెబితే కంగారు పడుతుందని చిన్న యాక్సిడెంట్ అని నేను వెళ్లి చూసి వస్తా అని హుటాహుటిన నార్కట్ పల్లికి వెళ్ళిపోయాడు.అయితే భర్తకు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఆమె వెంటనే భర్త క్షేమంగా రావాలని పూజ గదిలోకి వెళ్లి పూజలు చేస్తుందంట.ఇక్కడ ఆశ్చర్యపరచే ఇంకొక విషయం ఏమిటి అంటే…హరికృష్ణ భౌతికకాయం హైదరాబాద్ వస్తున్నా కూడా ఆమెకు ఇంతవరకు ఈ విషయం తెలియదంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎందుకంటే ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం అవ్వడం లేదు.కన్న కొడుకు జానకి రామ్ చనిపోయినప్పుడే ఆమె కోలుకోడానికి చాలా సమయం పట్టింది.ఇప్పుడు భర్త కూడా చనిపోయాడని తెలిస్తే ఆమె తట్టుకోలేదని ఎవరు చెప్పడం లేదంట.ఎవరినైనా అడిగితే బాగానే ఉన్నాడు.తీసుకొస్తున్నారని చెబుతున్నారంట.భర్త వచ్చేంతవరకు పూజ గదిలోనే ఉంటా అని లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పిందంట.ఈ ఘటన చూసి నందమూరి ఫ్యామిలీ మొత్తం కంటతడి పెడుతున్నారంట.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హరికృష్ణ మరణం గురించి ఆ మరణవార్తను భార్య లక్ష్మికి చెప్పకుండా ఉన్న విషయం గురించి అలాగే భర్త మరణవార్త తెలియని లక్ష్మి చేస్తున్న పూజ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గ MLA గా ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు ?