యాక్సిడెంట్ ముందు ఏం జరిగిందో షాకింగ్ నిజాలు చెప్పిన కారులో ఉన్న వ్యక్తి

630

నంద‌మూరి వంశంలో మొద‌టిస్టార్ ఎన్టీఆర్ త‌న‌యుడు, హ‌రికృష్ణ దుర‌దృష్ట‌వ‌శాత్తు కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు….ఉదయం హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర రోడ్డు ప్రమాదం లో మరణించారు… స్పీడ్ మీట‌రు చూస్తుంటే 120 కిలోమీట‌ర్ల వేగంతో కారు ప‌ల్టీకొట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక‌పోలీసులు కూడా ఈ ప్ర‌మాదానికి కార‌ణాలు తెలుసుకుంటున్నారు… అస‌లు హ‌రికృష్ణ ఇంత ఉద‌యం నెల్లూరు ఎందుకు వెళ్తున్నారో..? కార్ ప్రమాదం ఎలా జరిగిందో..? అసలు ఆ స‌మ‌యంలో కార్ ఎవ‌రు డ్రైవ్ చేస్తున్నారో.. ప్రత్యక్ష సాక్షి శివాజీ తెలిపారు. ఓసారి ఆ వివ‌రాలు తెలుసుకుందాం.

Image result for nandamuri harikrishna car accident

నెల్లూరు లో ఓ ఫంక్షన్ కు హరికృష్ణ తో పాటు అయన స్నేహితులు శివాజీ , వెంకట్రావ్ హైదరాబాద్ నుండి సరిగ్గా ఉదయం 4-30 లకు AP28BW2323 కార్ లో బయలు దేరారు… నల్గొండ సమీపంలోని అన్నేపర్తి ద‌గ్గ‌ర‌కు కారు చేరినప్పటికీ అక్కడ ఏదో రాయి వంటిది అడ్డం వచ్చింది. ఆ రాయి పైకి కారు ఎక్కడంతో బోల్తా పడింది. ప్రమాద సమయంలో హరికృష్ణే కారు నడుపుతున్నారు..పక్క సీట్లో శివాజీ కూర్చోగా, వెనుక సీట్లో వెంకట్రావ్ కూర్చున్నారు… గంటకు 120 కి.మీ స్పీడ్ తో కార్ ప్రయాణిస్తుంది. మేమిద్దరం సీట్ బెల్ట్ పెట్టుకోగా , హరికృష్ణ మాత్రం బెల్ట్ పెట్టుకోలేదని దాంతో ఆయన కార్ డోర్ లోప‌ల నుండి బయటపడినట్లు శివాజీ తెలిపారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడానికి ప్రధాన కారణాలు అతివేగం , సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే అని శివాజీ చెప్పిన తీరు చూస్తే అర్ధం అవుతుంది.

Image result for nandamuri harikrishna car accident

అలాగే ప్రమాదం జరిగిన వెంటనే హాస్పటల్ కు తీసుకొచ్చిన ప్రాణాలు దక్కేవేమో కాని ఆయ‌న్ని ప్రమాదం జరిగిన తర్వాత అరగంట సేపు వరకు కూడా హాస్పటల్ కు చేరుకోలేకపోయారు. మొత్తం మీద అతివేగం నందమూరి కుటుంబం లో మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సినిమా ఫంక్షన్ లలో అభిమానులకు అతివేగంగా వెళ్లకూడదు, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించేవారు. కానీ ఇప్పుడు ఆయన కుటుంబం లోనే మరో ప్రాణం పోవడం ఆకుటుంబాన్ని తీవ్ర విషాదం లో నింపింది. ఇక ఆయ‌న త‌న‌యుడు జానకి రామ్ కూడా ట్రాక్ట‌ర్ ని త‌ప్పించ‌బోయి నాలుగు సంవ‌త్స‌రాల క్రితం ఇలాగే ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

ఆ మ‌ర‌ణం త‌ర్వాత ఎన్టీఆర్ కుటుంబం ఎక్క‌డికి వెళ్లినా సీటు బెల్ట్ ధ‌రించుకుని కారులో ప్ర‌యాణం చెయ్యాల‌ని చెబుతూనే ఉన్నారు.. ఇది ఓ క్యాంపెయిన్ గా కూడా చేశారు. ఇక ఎన్టీఆర్ త‌న ఆడియో వేదిక‌ల‌పై ప‌లు ఫంక్ష‌న్ల పై ఇదే విష‌యాన్ని తెలియ‌చేస్తూ ఉంటారు. సీటు బెల్ట్ ధ‌రించాలి అని అలాగే వేగంగా వెళ్ల‌ద్దు అని ఇప్పుడు మ‌రోసారి వారి కుటుంబంలో అదే వేగం మ‌రో ప్రాణాన్ని బ‌లితీసుకుంది.అందుకే ప్ర‌యాణాలు చేసే స‌మయంలో అతి వేగం నియంత్రించుకోండి.. ఇలా ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి.. ఇలా వేగంగా వాహ‌నాలు న‌డిపే వారికి తెలియ‌చేయండి. వారితో పాటు ఎదుటి వారి ప్రాణాలు కూడా మీ డ్రైవింగ్ పై ఆధార‌ప‌డి ఉంటాయి.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి.