హ‌రికృష్ణ ఉద‌యం 3:45ని.లకు ఫోన్ చేశారు ఆవ్యక్తి ఫోన్ లిప్ట్ చేసిఉంటే ఇలా జ‌రిగేది|

514

నంద‌మూరి వార‌సుడు నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం వారి కుటుంబాన్ని జీర్ణించుకోలేకుండా చేస్తోంది…. ఆయ‌న మ‌ర‌ణం ఇటు పార్టీ నాయ‌కుల‌ను సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌ను అలాగే ప‌రిశ్ర‌మ‌కు చెంద‌ని వ్య‌క్తుల‌ను షాక్ కు గురిచేసింది… మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు…జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. హరికృష్ణ చివరిచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు చివరిసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ చితికి కళ్యాణ్‌రామ్‌ నిప్పంటించారు. హరికృష్ణ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

Image result for hari krishna dead body

ఇక అక్క‌డే ఆయ‌న చితిని చూస్తూ నంద‌మూరి వార‌సులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు వారి దుఃఖాన్ని చూసి అంద‌రికి క‌న్నీరు వ‌చ్చింది.ఇక ఆయ‌న ఉద‌యం పెళ్లికి బ‌య‌లుదేరే స‌మ‌యంలోఓ మిత్రుడికి ఫోన్ చేశార‌ని, అత‌ను కూడా పెళ్లికి వ‌స్తారు అని అనుకుంటే, అత‌ను ఉద‌యం 3.30 నిమిషాల వ‌ర‌కూ ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో హ‌రికృష్ణ సెంటిమెంట్ ను ప‌క్క‌న పెట్టి ముగ్గురు ప్ర‌యాణించారు అని తెలుస్తోంది.ఇప్పుడు టీడీపీ ఓ విష‌యాన్ని తెలియ‌చేసింది …కావ‌లిలో తెలుగుదేశం పార్టీ అభిమాని వివాహానికి ఆయ‌న వెళ్ల‌డం లేద‌ని, మీడియా ఇది గ్ర‌హించాలి అని తెలియ‌చేసింది..నంద‌మూరి కుటుంబానికి ఎంతో కాలంగా తెలిసిన, కావ‌లికి చెందిన ట్రావెల్స్ మోహ‌న్ కుమారుడి వివాహానికి ఆయ‌న వెళ్లారు అని ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ స‌మ‌యంలో ఆయ‌న ముగ్గురు స్నేహితుల‌తో పెళ్లికి వెళ‌దాము అని అనుకుంటే ఇద్ద‌రు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌టం, మ‌రో స్నేహితుడు ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో సెంటిమెంట్ ప‌క్క‌న పెట్టి ముగ్గురు పెళ్లికి బ‌య‌లుదేరారు అని అంటున్నారు…. ఒక‌వేళ ఆయ‌న ఇంత సెంటిమెంట్ న‌మ్ముకున్నారు కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో మూడ‌వ వ్య‌క్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే, క‌చ్చితంగా ఆయ‌న‌తో క‌లిసి న‌లుగురు ప్ర‌యాణించేవారు ఇలా ప్ర‌మాదం జ‌రిగి ఉండేది కాదు అని ఆయ‌న అభిమానులు బాధ‌ప‌డుతున్నారు.. కాని విధి ఇలా రాసిపెట్టి ఉంది ప్ర‌మాదం జ‌ర‌గాలి అని ఉంది అని వారిలో వారే బాధ‌ప‌డుతున్నారు. నంద‌మూరి కుటుంబంలో ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టి కారుప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం ఆ కుటుంబాన్ని కోలుకోలేని విధంగా షాక్ కు గురి చేస్తున్నాయి. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.