ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసిన హన్సిక..ఎవరి పాత్ర కోసమో తెలుసా..

237

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related image

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో అనేక పాత్రల కోసం పలువురు సినీ ప్రముఖులను తీసుకుంటున్నారు. ఈ కోవలో మరో హీరోయిన్‌కు అవకాశం కల్పించారు.ఎన్టీఆర్‌తో అప్పట్లో నటించిన అందరి హీరోయిన్స్ లను వెండితెరపై చూపించబోతున్నారు.

Image result for hansika ntr biopic

హీరోయిన్స్ పాత్రల కోసం రకుల్ ప్రీత్, నిత్యా మీనన్, పాయల్ రాజ్‌పుత్, లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు హన్సికను కూడా తీసుకొని ప్రాజెక్టుకి కొత్త అందం తీసుకొచ్చాడు.చిత్రంలో జయప్రద పాత్రలో హన్సికను తీసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ‘అడవి రాముడు, యుగ పురుషుడు’ వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో చిందులేసింది. వీరి కాంబోలో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి.