బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న గుంటూరు అమ్మాయి ఆమె ఎవ‌రంట

423

బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో హౌస్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి సామాన్యుడు (Common Man) గణేశ్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న గణేశ్.. మధ్యలో కాస్త పుంజుకున్నట్లు కనిపించినా.. గత రెండు వారాలుగా అతని గేమ్ మరీ తీసికట్టుగా మారింది. ముఖ్యంగా.. గత వారం తన మైక్ బ్యాటరీలు తీసి మరీ.. బిగ్‌బాస్‌పై అక్కసు వెళ్లగక్కడం, టాస్క్‌ల్లో చురుకుదనం తగ్గిపోవడంతో అతను సూట్‌కేస్ సర్దుకోక తప్పలేదు.. ఇక మూడుసార్లు ఎంట్రీ ఇచ్చిన కామ‌న్ మ్యాన్ నూత‌న నాయుడు కూడా ఆదివారం త‌న బ్యాగ్ స‌ర్దుకుని వెళ్లిపోయారు ఆయ‌న్ని కూడా బిగ్ బాస్ ఈ వారం హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించారు.

Image result for big boss 2 telugu

ఇక మ‌రో మూడు వారాల్లో ఎండ్ కానున్న బిగ్ బాస్ హౌస్ లో మ‌రింత ర‌వ‌స‌వ‌త్తంగా టాస్క్ లు జ‌రుగ‌నున్నాయి. ఇక హౌస్ లో ఎవ‌రు ఎలా ఉంటారు అనే దాని పైనే ప్రేక్ష‌కులు కూడా త‌మ అభిప్రాయాల‌ను ఓట్ల రూపంలో తెలియ‌చేయ‌నున్నారు. ఇక ఈ స‌మ‌యంలో గ‌త నెల‌ల బిగ్ బాస్ చేసిన ఓ ఆడిష‌న్ గురించి ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేష‌న్ తో పాటు ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా స‌భ్యుల్ని స‌ర్ ఫ్రైజ్ చేయ‌నుంది అని అంటున్నారు.

Image result for big boss 2 telugu

దీనికి రీజ‌న్ కూడా చెబుతున్నారు. బిగ్ బాస్ గ‌త నెల‌లో హౌస్ లోని రావ‌డానికి కామ‌న్ మ్యాన్స్ కంటెస్టెంట్స్ కి మ‌రోసారి ఆడిష‌న్ నిర్వ‌హించారు. ఇందులో ఒక‌రిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించాలని భావించారు.. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ క‌లిగిన వారికి ఈ అవ‌కాశం ఇచ్చారు. వారిలో కొంద‌రు చ‌క్కని నైపుణ్యత అలాగే న‌వ్వించే వీడియోలు, త‌మ న‌ట‌న‌తో మెప్పించే వీడియోల‌ను పంపించాలి. ఇలా పంపిన వీడియోలను చూసి వారిలో ఒక‌రిని బెస్ట్ కంటెస్టెంట్ గా తీసుకుంటారు. ఇలా ఇప్పుడు ఓ లేడీ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గుంటూరు జిల్లాకు చెందిన ఆ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట‌ర్ అవ్వ‌నుంది. గ‌త నెల 27 -28 న ఈ ఆడిష‌న్స్ పూర్తి అయ్యాయి అని తెలుస్తోంది. అందులో ఆమె బిగ్ బాస్ హౌస్ కు సెల‌క్ట్ అయింది అని అంటున్నారు. మ‌రి నేటి షోలో ఆమె ఎంట్రీ ఉంటుంది అని తెలుస్తోంది. ఇటు ఇంటి స‌భ్యులే కాదు ప్రేక్ష‌కులు కూడా ఈ స‌స్పెన్స్ లో ఎలా ఉంటారు అనేది చూడాలి. మ‌రో మూడువారాల్లో ముగిసే ఈ షోలో, కొత్త కొత్త నిర్ణ‌యాల‌తో బిగ్ బాస్ మ‌రింత మ‌సాలా క‌లిపిస్తున్నారు హౌస్ లో.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.