‘సైరా’ సెట్ ను ద్వంసం చేసిన ప్రభుత్వ అధికారులు..కారణం ఇదే..

484

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా సైరా నర సింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రంగస్థలం సెట్స్ ను వాడుతున్నారు.శేరిలింగంపల్లిలో రంగస్థలం సెట్స్ లోనే సైరా కోసం సెపరేట్ సెట్స్ వేశారు.

ఈ స్థలాన్ని సైరా యూనిట్ కబ్జా చేయాలని చూసిందని దీనికి సంబందించి చాలాసార్లు చిత్రయూనిట్ కు నోటీసులు పంపించామని కాని ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సైరా షూటింగ్ జరుగుతున్న సెట్స్ ను ద్వంసం చేశారు.సెట్ లో ఉన్న చిరంజీవి ఇంటి సెట్ ను కూల్చివేశారట. అంతేకాదు చిత్ర దర్శక నిర్మాతల మీద కూడా రెవిన్యూ అధికారులు సీరియస్ అయ్యారట.

సినిమా వరకు అయితే తమ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే షూటింగ్ కూడా జరిపేందుకు వీలు ఉండదని చెప్పారట.మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చిత్రయూనిట్ మీద రెవిన్యూ అధికారులు పోలీస్ కేసు కూడా పెట్టారని తెలుస్తుంది.మరి ఈ వివాదం నుండి సైరా దర్శక నిర్మాతలు ఎలా బయట పడతారో చూడాలి.