అక్రమ కట్టడాలలో దర్సకుడు వినాయక్ భవనం కూల్చివేత

195

రెండు తెలుగు రాష్టాలలో అక్రమ కట్టడాల మీద ప్రభుత్వాలు జులుం విడులుస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణాలో ఎక్కడ అక్రమ కట్టాడాలు ఉన్నా కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో జగన్ కూడా అదే చేస్తున్నాడు. నిన్నటికి నిన్న తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో అక్రమంగా కట్టిన టీడీపీ ప్రజావేదికను కూలగొట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఇంకా ఏపీలో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చేస్తాం అని చెప్పారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే గత ఐదేళ్ళలో ఎన్నో అక్రమ కట్టడాలు కూల్చేశారు.

Image result for vv vinayak

ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ కు అధికారులు ఝలక్ ఇచ్చారు. వట్టినాగులపల్లిలో ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది..ఆ ప్రాంతంలో జీహెచ్ఎం సీ అనుమతి లేకుండా ఆ భవనాన్ని నిర్మించారని,అది అక్రమ కట్టడం అయినందున అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది. అలానే 111 జీవో కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని విని అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం తో ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలానే ఆ ప్రాంతంలో ఉన్న మరిన్ని అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చనున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

అక్రమంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను ఒక్కొక్కటిగా జీ హెచ్ ఎం సి అధికారులు కూల్చివేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వి వి వినాయక్ భవనాన్ని కూడా కూల్చివేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో స్టాలిన్,ఆది వంటి పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వినాయక్. అయితే ఇప్పుడు ఆయన తాజా గా నటుడిగా కూడా మారి దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఒక చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో హీరో ప్రభాస్ ఇంటి విషయంలో కూడా పెద్ద రగడ జరిగింది. కోర్ట్ వరకు వెళ్ళింది. ఇలా రెండు తెలుగు రాష్టాలలో సామాన్య ప్రజలు సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం వేస్తున్నారు. మరి తెలంగాణా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాలు అక్రమ కట్టడాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి వివి వినాయక్ కట్టడాన్ని కూల్చడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.