నాగబాబు గురించి సంచ‌ల విష‌యాలు చెప్పిన గెటప్‌ శ్రీను

490

బుల్లితెర‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఎంత పేరు తెచ్చుకుందో తెలిసిందే ..ఇందులో కంటెస్టెంట్స్ కూడా ఈ షో నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..జబర్దస్త్ దాదాపు ఏడు సంవత్సరాలుగా ఓ ప్రముఖ ఛానల్‌లో నిరంతరాయంగా వస్తున్న కామెడీషో.. ఈ షో రేటింగ్స్ చూసినా.. యూ ట్యూబ్ వ్యూస్ చూసినా దిమ్మతిరగడం ఖాయం. జబర్దస్త్‌లో కామెడీ స్కిట్లు చేసిన ఎందరో సెలబ్రెటీ స్టేటస్ సొంతం చేసుకున్నారు.అందుకే వీరికి ఈజీగా సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి ధ‌న రాజ్ నుంచి గెట‌ప్ శ్రీను సుదీర్ చ‌మ్మ‌క్ చంద్ర ఆది ఇలా అంద‌రూ కూడా సినిమాల్లో ఇప్పుడు మంచి రోల్స్ వేస్తున్నారు.

Image result for getup srinu

షకలక శంకర్ హీరోగా కూడా మారాడు.. ఇలా పేర్లు చెప్పుకుంటే చాలా ఉంటాయి. అలాగే ఆరంభం నుంచి ఈ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న నాగబాబు ఈ షో గురించి చాలా కేర్ తీసుకుంటారట. ఈ స్కిట్లలో ఏమాత్రం కామెడీ తగ్గినా కంటెస్టెంట్స్‌కు చీవాట్లు పెడతారట.ఈ షో ద్వారా పాపులారిటీ పొందిన గెటప్ శ్రీను.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలు పంచుకున్నారు. నాగబాబు గారి వద్ద.. పార్టిసిపెంట్స్ అందరి క్యాలిక్యులేషన్స్ ఉంటాయట. కమెడియన్స్ ఎవరైనా స్కిట్ల గురించి లైట్‌గా తీసుకుంటే పిలిచి చీవాట్లు పెడతారట.

అయితే ఆయన తిట్టేది మామంచి గురించే అంటున్నాడు గెటప్ శ్రీను. అలా తిట్టిన తర్వాత ఇంటి నుంచి తెచ్చిన వంటలతో కడుపునిండా భోజనం పెడతారట. ఇన్నేళ్లుగా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇంతగా హిట్‌ అవుతూ కొనసాగడంలో నాగబాబు గారి పాత్ర చాలా ఉందంటున్నారు గెటప్ శ్రీను. తనకు నాగబాబు గురువుతో సమానమన్న గెటప్ శ్రీను.. ఎవరినీ నొప్పించేలా స్కిట్లు చేయవద్దని చెబుతారట. అన్ని టీమ్‌లను సమదృష్టితో చూస్తారని.. కుటుంబ సభ్యుల్లా భావిస్తారని నాగబాబును ప్రశంసలతో ముంచెత్తాడు గెటప్ శ్రీను.మ‌రి చూశారుగా అందుకే ఇలా అంద‌రు క‌లిసి సమిష్టి కృషిగా వెళుతున్నారు కాబ‌ట్టి ఇప్పుడు ఈ స్కిట్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి… మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను అలాగే జ‌బ‌ర్ద‌స్త్ లో ఎవ‌రి స్కిట్స్ మీకు న‌చ్చుతాయో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.