గెటప్ శ్రీను నిజస్వరూపం బయటపెట్టిన భార్య సుజాత..షాక్ లో సుధీర్ రామ్ ప్రసాద్ .

435

ఆలీ టాక్ షోలో ప్లే చేసిన వీడియోలో గెటప్ శ్రీను గురించి ఆయన భార్య సుజీ చెబుతూ.. మా ఆయన గురించి చెప్పాలంటే ఆయన సకలకళావల్లభుడు. ఆయనకు తెలియనిది ఏదీ ఉండదు. మంచి వంటగాడు. ఆయన వంట చేస్తానంటే నాకు చాలా హ్యాపీ. కానీ ఆయనను చాలా కాలంగా ఓ ప్రశ్న అడుగాలని అనుకొంటున్నాను అని తేజు అన్నారు.

ఇరుకున పడిన గెటప్ శ్రీను

గెటప్ శ్రీనును ఉద్దేశించి సుజీ ఓ ప్రశ్నను అడుగుతూ.. ఓ రోజు ఆయన అర్ధరాత్రి కలవరిస్తూ ఎవరికో ప్రపోజ్ చేశారు. మాటల్లో ప్రేమను వ్యక్తం చేశారు. ఆ రోజు అలా ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు? చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పమని సుజి అడిగారు. భార్య అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇస్తూ ఓ సినిమా కోసం ఓ రోజు షూటింగ్‌లో బిజినెస్‌మెన్ స్కూప్‌తో భారీగా డైలాగులు చెప్పాల్సి వచ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో వాటిని రోజంతా మననం చేసుకొంటూ ఉన్నాను. అదే రాత్రి కూడా నిద్రలో కలువరించాను అని చెప్పారు. భార్య అడిగిన ప్రశ్నకు ఏదో చెప్పి తప్పించుకోవాలని గెటప్ శ్రీను చూశాడు. అయితే తను ఎవరిని కలువరించాడో అనే విషయాన్ని భార్య చేతే ఆలీ చెప్పించడంతో గెటప్ శ్రీను ఇరుకునపడ్డాడు. తాను ఏదో అనుకొని ఏదో చెప్పాను అని గెటప్ శ్రీను అన్నారు. గెటప్ శ్రీను కలువరించింది ఎవరినో కాదు.. మెగాస్టార్ చిరంజీవిని అని భార్య సుజి వెల్లడించింది. గెటప్ శ్రీనుకు చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. నిద్రలో కూడా తాను అంటే ఎంత ఇష్టమో కలవరిస్తూ చెప్పారు అని గెటప్ శ్రీను భార్య సుజి గుట్టువిప్పింది.