టాలీవుడ్‌లోకి జెనీలియా రీ ఎంట్రీ?

395

అంతేనా…ఇంకేం కావాలి..కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు…ఈ డైలాగ్ అప్పట్లో ఒక సంచలనం.. యూత్ మొత్తం ఈ డైలాగ్ వెంబడి పడ్డారు.ఆ సినిమాలో నటించిన జెనీలియాకు అయితే వీరాభిమానులుగా మారిపోయారు.ఇప్పటికి నీకు ఎలాంటి భార్య కావాలని అడిగితే బొమ్మరిల్లు జెనీలియాలాంటి అమ్మాయి కావాలని అడిగే కుర్రాళ్లు ఉన్నారు.

Image result for genelia bommarillu

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొన్న తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. పిల్లలను, ఇంటిని చూసుకొంటూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యలో కొన్ని హిందీ, మరాఠీ సినిమాల్లో గెస్ట్‌గా కనిపిస్తున్నది.

Related image

అయితే ఆమె త్వరలోనే మళ్ళి తెలుగు తెర మీద మెరవనున్నారు.తెలుగు సినిమాలో నటించడానికి జెనీలియా రెడీగా ఉన్నారని, ఓ నిర్మాత చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు.