షో లోనే కొట్టుకున్న గెటప్ శ్రీను , రాంప్రసాద్ షాక్ లో సుధీర్ , రష్మీ

641

ఈ మధ్య టెలివిజన్ రంగంలో చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే ఆశ్చర్యపోకతప్పదు. సెలెబ్రిటీలను తీసుకొచ్చి వివిధ పోగ్రామ్స్ చేస్తుంటారు. ఆ షోకు వచ్చినందుకు సెలెబ్రెటీలకు లక్షలకు లక్షలు ఇచ్చాము అని చెప్పుకుంటారు. అయితే నిజంగానే ఆ సెలెబ్రెటీలకు అంత డబ్బు ఇచ్చారా.. నిజంగానే ఆ షోకు అంతా డబ్బు వస్తుందా అంటే తెలీదని చెప్పుకోవాలి. ఈ విషయం పక్కన పెడితే చాలా టెలివిజన్ షోలకు సెలెబ్రిటీలు వచ్చి షోలో జరిగేది చూసి ఆశ్చర్యపోవడం,కామెంట్స్ చెయ్యడం ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకోవడం ఒకరి మీద ఒకరు విరుచుకుపడటం లాంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు అయితే కొట్టుకునేంత పని చేస్తారు.

Image result for getup srinu

అయితే వాళ్ళు నిజంగానే అంతలా కొట్టుకుంటారా. .ఒకరిని ఒకరు అన్ని మాటలు అనుకుంటారా అంటే అస్సలు ఉండదు. అదంతా స్క్రీన్ మీద చేసే మరొక డ్రామా మాత్రమే. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రావడానికి అలా చేస్తారు.ఎన్నో షోలలో ఇలా సెలెబ్రిటీలు జనాలను పిచ్చోళ్లు చేస్తారు. అయితే లేటెస్ట్ గా సిక్స్త్ సెన్స్ అనే షోలో ఇది మరొకసారి జరిగింది. ఎప్పుడు కామెడీలు చేస్తూ సరదాగా ఉండేవాళ్ళు కాస్త సీరియస్ అయిపోయారు. మాములుగా అక్కడ జరిగే షోనే కామెడీగా ఉంటుంది. ఇక కమెడియన్స్ సీరియస్ చేస్తే అది ఇంకా కామెడీగా ఉంటుంది. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయ్యే సిక్స్త్ సెన్స్ పోగ్రామ్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. యాంకర్ ఓంకార్ తనదైన శైలిలో ఈ పోగ్రామ్ ను నడిపిస్తున్నాడు. ఈ పోగ్రామ్ కు పెద్ద పెద్ద సెలెబ్రిటీలు రావడంతో షో మీద జనాలకు బాగా ఇంట్రెస్ట్ ఏర్పడింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ షోను ఓంకార్ స్పెషల్ గా డిజైన్ చేశాడు.ఓంకార్ తన వాక్ చాతుర్యంతో తన మేనరిజమ్స్ తో షోను రక్తికట్టిస్తున్నాడు. అయితెహ్ లేటెస్ట్ ఎపిసోడ్ లో భాగంగా ఆటో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను ఈ షోకు వచ్చారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే ఆటో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనులా మధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దగా అవుతుంది. మాటల దగ్గర ఆపకుండా ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయికి వెళ్తారు.వీళ్ళ గొడవను చూసి అక్కడ సుడిగాలి సుదీర్ షాక్ అయిపోతాడు. వీళ్ళు మాటలు అనుకుంటున్నారంటే నిజంగానే కొట్టుకుంటున్నారేంటి అని ఇద్దరి మధ్య గొడవను సద్దుమణిగిస్తారు. వీరి తతంగాన్ని ఓంకార్ కూడా ఆశ్చర్యకరంగా చూస్తుంటాడు.అసలు వీళ్ళు ఎందుకు గొడవపడ్డారో తెలియాలంటే ఆ ఎపిసోడ్ వచ్చెనంతవరకు ఎదురుచూడాల్సిందే.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఆటో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనులా గురించి అలాగే వీళ్ళు షోలో భాగంగా కొట్టుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.