గీత గోవిందం సినిమాలో హీరో కోసం విజయ్ కంటే ముందు ఆ హీరోను అనుకున్నారటా..

446

విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా సోలో ఫేమ్ పరుశురాం తెరకెక్కించిన గీత గోవిందం చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భాంగా చిత్ర ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.ముఖ్యంగా ఈ సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలి ట్రెండ్ స్ప్రుష్టిస్తుంది.ఇప్పటికే 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఈ నేపథ్యం లో దర్శకుడు పరుశురాం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం తీయడం కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చారు.అయితే ఈ చిత్రం విజయ్ కోసం రాయలేదని ఈ చిత్రం కథ ను అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకొని రాసానని , ఐతే బన్నీకి కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయాడని .దీంతో ఈ కథ విజయ్ దేవరకొండ తో చేయాల్సి వచ్చిందని తెలిపాడు.

ఇక హీరోయిన్ విషయం లో మాత్రం చాల కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. కథ విన్న బన్నీ హీరోయిన్ పాత్ర బాగా నచ్చి.. తనకు బాగా క్లోజ్ అయిన ఇద్దరు ముగ్గురు హీరోయిన్లకు చెప్పాడట. కానీ వాళ్లెవ్వరూ కూడా ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపాడు. ఇక చివరగా రష్మిక దగ్గరికి వెళ్లిందని , ఆమెకోసం కూడా మూడు నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపాడు.