కేరళ వరద బాధితుల కోసం” గీత గోవిందం” చిత్ర యూనిట్ షాకింగ్ నిర్ణయం..

411

కేరళ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేరళ వరద బాధితులకు అండగా యావత్తు దేశమంతా ముందుకొస్తుంది.కేరళ వరద బాధితులకు దేశం నలుమూలల నుంచి విరివిగా విరాళాలు అందుతున్నాయి.సినీరాజకీయ ప్రముఖులంతా కేరళ బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

Image result for kerala

డబ్బుల రూపంలో కొందరు సహాయం చేస్తుంటే సహాయక చర్యల్లో పాల్గొని వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారి ప్రాణాలను కాపాడుతున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ యువహీరో ,గీత గోవిందం హీరో అయిన విజయ్ దేవరకొండ అందరి కంటే ముందు రూ ఐదు లక్షలను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమందించారు.అంతే కాకుండా కేరళ రాష్ట్రాన్ని అదుకొవడానికి అందరూ ముందుకురావాలని పులుపునిచ్చారు.

Image result for geetha govindam team

ఈక్రమంలో తను నటించి ప్రస్తుతం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న గీత గోవిందం సినిమా యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ సినిమాకు వచ్చే వసూళ్ళను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని తెలిపారు.