మరో రికార్డ్ ను సొంతం చేసుకున్న గీతగోవిందం

252

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు ఈ సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంలో నాగబాబు, సుబ్బరాజు, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు.

Image result for geetha govindam

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.విజయ్ దేవరకొండకు 100 కోట్ల హీరోగా పేరొచ్చింది.వలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 కోట్లు వసూలు చేసింది.ఇంకా ఈ మూవీ కలెక్ట్ చేస్తూనే ఉంది.

సినిమా విడుదల ముందే కొన్ని సీన్లు లీక్ కావడం నిర్మాతలను కాస్త కంగారు పెట్టినా వసూళ్లపై ఆ ఎపెక్ట్ పడక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 59 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది.ఈ కాలంలో ఇలా 50 రోజులు ఒక సినిమా నడవడం ఇప్పుడు పెద్ద విశేషం అయ్యింది.