గీత గోవిందం దర్శకుడి తరువాతి సినిమా ఆ హీరోతో…!

387

విజయ దేవరకొండ రష్మిక మందన జంటగా నటించిన గీత గోవిందం విడుదలయిన దగ్గరనుంచి మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది..ఈ సినిమాకు దర్శకుడు పరశురాం..ఈ సినిమా విజయం సాదించడంతో దర్శకుడు పరశురాం కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు..రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖుల విలువైన ప్రసంసలు కూడా అందుకున్నాడు పరశురాం..దాంతో పరశురామ్ తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం పరశురాం తరువాతి చిత్రం మంచు విష్ణుతో ఉంటుందని తెలుస్తోంది. మోహన్ బాబు తన కుమారుడు తదుపరి ప్రాజెక్ట్ కోసం దర్శకుడుగా పరుశురామ్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఐతే ఈ కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం పరుశురామ్ గీత గోవిందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ అన్ని పూర్తి అయ్యాక పరుశురామ్ ఈ చిత్రం పై వర్క్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకం పై మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిచనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియాల్సి ఉంది.