బన్నీ తో “గీత గోవిందం” దర్శకుడి సినిమా…!

361

సోలో, సారొచ్చారు సినిమాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు పరశురాం..తానూ దర్సకత్వం వహించిన గీత గోవిందం సినిమా ఈ నెల 15 న విడుదల కానుంది..విజయ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది..అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు..గతంలో గీతా ఆర్ట్స్ సంస్థలో అల్లు శిరీష్ హీరోగా పరశురాం తెరకెక్కించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా విజయం సాదించింది..

ఇదిలా ఉండగా దర్శకుడు పరశురాం ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు..అల్లు అర్జున్ తో ఉన్న స్నేహం వలన అతనికి తరచూ కధలు వినిపించేవాడిని..దీంతో కొంతమంది బన్నీ తో సినిమా చేయోచ్చు కదా అనేవారు..బన్నీకి ఎప్పుడు? ఏ కథ సరిపోతుందో? అప్పుడు… అలాంటి కథనే తెరకెక్కిస్తా. బన్నీతో త్వరలోనే సినిమా చేస్తా.” అని చెప్పుకొచ్చాడు పరశురాం. ఆల్రెడీ ఈ కధను అల్లు అరవింద్ కు వినిపించాడట..నా పేరు సూర్య సినిమా తర్వాత కొత్త సినిమాఏదీ అంగీకరించలేదు అల్లు అర్జున్. అయితే చాలా మంది దర్శకులు లైన్ లో వున్నారు. మరి పరశురాం సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి..