అమెరికాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న గీతగోవిందం..

394

ఈ మద్య కాలంలో విడుదల అయిన సినిమాలలో యూత్ కు బాగా నచ్చిన సినిమా గీతాగోవిందం.విజయ్ దేవరకొండ, రష్మికలు హీరోహీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయినా ప్రతి సెంటర్ లో మంచి విజయం సాదించింది.మంచి కలెక్షన్స్ రాబడుతుంది.వసూళ్ల విషయంలో ‘గీతగోవిందం’ దూసుకుపోతోంది.

Image result for geetha govindam

తొలి ఐదు రోజుల్లోనే దాదాపు ముప్పై కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించిన సినిమాగా సూపర్ హిట్ అనిపించుకుంటోంది. ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కొత్త ఫీట్లను సాధిస్తోంది.ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.ఇందులో భాగంగా యూఎస్ వసూళ్లలో గీతగోవిందం మరో ఫీట్‌ను సాధించింది. 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించింది ఈ సినిమా.తద్వారా వసూళ్ల పర్వంలో కొత్త ఫీట్ సాధించింది.

Related image

విజయ్ దేవరకొండ ఇదివరకటి సూపర్ హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ యూఎస్‌లో 1.7 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ‘గీతగోవిందం’ ప్రభంజనాన్ని చూస్తుంటే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకోవడం కూడా పెద్ద కష్టంగా కనిపించడం లేదు. అదే జరిగితే యూఎస్‌లో భారీ వసూళ్లను దక్కించుకున్నట్టే. కేవలం అమెరికా అని మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియాలో కూడా ‘గీతగోవిందం’ వసూళ్లు మంచి స్థాయిలో ఉండటం గమనార్హం.