100 కోట్లకు దగ్గరలో గీత గోవిందం..ఆనందంలో విజయ్ దేవరకొండ..

408

విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల సక్సెస్ తర్వాత గీత గోవిందం రూపంలో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకొన్నారు.గత ఆరు రోజుల్లో ఏ మాత్రం తగ్గకుండా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. గత ఆరు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

Image result for geetha govindam

విడుదలైన 5 రోజులకే రూ.50 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రం ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల వసూళ్లను సాధించడం గమనార్హం.సాధారణంగా వారంతం తర్వాత సోమవారం సినిమాల కలెక్షన్లు తగ్గుతాయి. కానీ గీత గోవిందం విషయంలో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఆగస్టు 20 తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది.యూఎస్ బాక్సాఫీస్ వద్ద గీత గోవిందం సత్తా చాటుతున్నది.

Image result for geetha govindam

తొలి రోజున మంగళవారం నుంచి గురువారం వరకు 731,490 డాలర్లు, శుక్రవారం 240,941, శనివారం 354,433, ఆదివారం 212,610 డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా 10.75 కోట్లు సాధించింది.ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఒకవేళ సాదిస్తే మాత్రం విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ఖాయం అంతేకాకుండా టాప్ హీరో అవ్వడం ఖాయం.ఈ విషయం తెలుసుకుని విజయ్ దేవరకొండ తెగ ఆనందపడిపోతున్నాడంటా.