రంగస్థలం, భరత్ అనే నేను రికార్డు బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ చిత్రం

330

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సిల్వర్ స్క్రీన్‌పై కలెక్షన్ల విలయతాండవం చేసింది. కెరీర్‌ ఆరంభంలోనే విజయ్‌ని రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చింది. తాజాగా గీత గోవిందం చిత్రం మరో ఘనతను సాధించింది. తెలుగు టెలివిజన్ రంగంలో ఈ చిత్రం భారీ రేటింగ్‌ను సాధించడం విశేషంగా మారింది.2018లో అత్యధిక టీఆర్పీ సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసింది.

బుల్లితెరపై స్వైర విహారం

జీ తెలుగులో ప్రీమియర్‌గా వచ్చిన గీత గోవిందం టీఆర్పీ విషయంలో రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి కంటే ఎక్కువ పాయింట్లను సాధించింది. గీత గోవిందం 20.80 పాయింట్లను సొంతం చేసుకోగా, మహానటి 20.16, రంగస్థలం 19.50, భరత్ అనే నేను 14.60, కృష్ణార్జున యుద్ధం 11.64 టీఆర్పీని సాధించింది.ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ రేటింగ్‌ను సాధించడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది.

బాక్సాఫీస్ వద్ద క్రేజీగా

ఇక ఓవరాల్‌గా తెలుగు టెలివిజన్ రంగంలో ర్యాంకులను పరిశీలిస్తే గీత గోవిందం చిత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. మగధీర, బాహుబలి చిత్రాలు 22.70 సాధించగా, బాహుబలి2 21.84, డీజే 21.70, ఫిదా 21.30, శ్రీమంతుడు 21.24, గీత గోవిందం 20.80 పాయిట్లను సాధించాయి.