మళ్ళీ తెర పైకి గీత గోవిందం కాంబో..!

409

గీత గోవిందం..సినిమా ఇప్పుడు టాలివుడ్ లో సక్సెస్ ఫుల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి కలక్షన్లు రాబడుతోంది..ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ దేవరకొండ, కన్నడ నటి రష్మిక మందానా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది..ఈ సక్సెస్ తో ఈ జంట మళ్ళీ తెరపైన కనువిందు చేయనుంది..ఈ జంట మళ్ళీ నటించాబూతున్న సినిమా డియర్ కామ్రేడ్..నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. ఈ చిత్రంలో రష్మిక మందానా క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకున్నారు.

కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంలో క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మంచి ఉత్కంఠ ఉంటుందట. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక కెమిస్ట్రీ హైలెట్ అవుతుందని చిత్రబృందం చెబుతుంది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.