ఫ్రెండ్షిప్ డే నాడు రాంచరణ్ కు అదిరిపోయా గిఫ్ట్ పంపిన NTR

161

ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాము. ప్రియనేస్తాలంతా వారి వారి స్నేహితులతో జాలీగా గడుపుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక గిఫ్ట్‌లు, ఫ్రెండ్‌షిప్ బాండ్‌ల కైతే కొదవే ఉండదు. అయితే సినిమా సెలబ్రెటీలు తమతో చదువుకున్న వారితో పాటు సినిమా ఇండస్ట్రీలో వారి ఫ్రెండ్స్ చిత్ర యూనిట్ తో కూడా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు..

Image result for ntr and ram charan

యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బాద్‌షా’. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరై అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుంది. వాస్తవానికి ఆ సినిమా కంటే ముందే వారి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, ‘బాద్‌షా’ ప్రారంభం రోజు నుంచే వీరిరువురి మధ్య స్నేహం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా RRR సినిమాలో ఇద్దరూ నటిస్తున్నారు. అందుకే ఈ సారి ఫ్రెండ్‌షిప్ డేని RRR ఏ దోస్త్ హాష్ ట్యాగ్‌తో ప్రత్యేకంగా జరుపుకోండి అంటూ ట్వీట్ చేసింది RRR యూనిట్. ప్రస్తుతం ఈ హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Image result for ntr and ram charan

ఈ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలను ‘RRR యే దోస్త్’ ట్యాగ్ తో చెప్పండి అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన RRR యూనిట్.. ఈ పోస్టర్ ద్వారా రామ రాజు, భీం స్నేహం గురించి చెప్పింది. అంతేకాదు మీ లైఫ్ లో కూడా ఇలాగే ఊహించని రీతిలో స్నేహితులుగా మారి మీ లైఫ్‌లో కీలకమైన వ్యక్తులకు ఈ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా విష్ చేయండి అని చెప్పారు.ఈ మేరకు ఎన్టీఆర్, రాజమౌళి సహా ఇతర యూనిట్ సభ్యులంతా RRR యే దోస్త్ హాష్ ట్యాగ్‌తో తమ తమ ప్రియ స్నేహితులకు విషెస్ చెబుతున్నారు. నిర్మాత సాయి కొర్రపాటికి రాజమౌళి శుభాకాంక్షలు తెలపగా, ఎన్టీఆర్ రామ చరణ్‌కి విష్ చేశారు.గమ్యం చేరేందుకు గాను విధి అనుకూలంగా ఉంటే, జీవితంలో సాయి లాంటి వ్యక్తి తోడవుతాడు. నమ్మకానికి చిహ్నమైన ఆ వ్యక్తి నా జీవితంలో నాకు ఎక్కువ మద్దతిచ్చిన వ్యక్తి. అతను నా భీమ్ నేను అతని ఆనందం తప్ప మరేమీ కోరుకోను” అంటూ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా రాజమౌళి ట్వీట్ పెట్టారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఫ్రెండ్ షిప్ చేసే ముందే మెల్లగా ఆలోచించి దిగండి. ఒక్కసారి ఫ్రెండ్ షిప్ మొదలయ్యాక ఆ స్నేహాన్ని అలాగే స్థిరంగా కంటిన్యూ చేయండి” అని సోక్రటీస్ చెప్పిన వాక్యాలను ట్వీట్ చేస్తూ రామ చరణ్‌తో నా స్నేహ బంధం గురించి ఇంతకుమించి వర్ణించలేను అని పేర్కొంటూ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ ట్వీట్ చూసి నందమూరి, మెగా అభిమానులు మురిసి పోతున్నారు… ఇక రామ్ చరణ్ కు ఎన్టీఆర్ గిఫ్ట్ పంపించారట, ఇద్దరూ కలిసి దిగన ఫోటోలతో కలిసి ఉన్న ఫ్రేమ్ ని ఎన్టీఆర్ చరణ్ కు పంపించారు అని తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు రాజమౌళఇ చిత్రం కోసం పెద్ద కసరత్తులు చేస్తున్నారు వీరిద్దరూ.

Related image

రాజమౌళి దర్శకత్వంలో RRR అనే వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ముఖ్యంగా మెగా నందమూరి అభిమానులు ఈ చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.సినిమాలో ఇద్దిరిని హైలెట్ చేయాలని కోరుకుంటున్నారు మొత్తానికి ఇరువురు గిఫ్ట్ల్ లు పంపించుకోవడంతో వీరిద్దరి స్నేహం ఇలాగే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.