ఫోర్బ్స్ జాబితా.. ఈ ఏడాది సంపాదనలో టాప్ లో ఉన్నవాళ్లు వీళ్ళే….

292

ఫోర్బ్స్ పత్రిక సినిమా తారలు, క్రికెటర్స్‌ ఏడాదిలో ఎంత సంపాదిస్తున్నారో లెక్క కట్టి ఏడాది చివర్లో ఓ లిస్ట్‌ను రిలీజ్‌ చేస్తుంది. ఈ ఏడాది కూడా తన టాప్‌ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌ 1 నుంచి సెప్టెబర్‌ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్‌లు, చేసిన బ్రాండ్‌ ప్రమోషన్స్‌ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు సల్మాన్‌ ఖాన్‌. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్‌.

Image result for salman khan rajani

ఈ జాబితాలో సౌత్‌ హీరోల్లో రజనీకాంత్‌ టాప్‌లో ఉన్నారు. 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్‌లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్‌ కల్యాణ్‌ 24వ పొజిషన్‌లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్‌ 28వ స్థానంలో నిలిచారు. 33 మహేశ్‌బాబు (24.33 కోట్లు), 34 సూర్య (23. 67 కోట్లు) నిలిచారు. దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు.

Image result for pawan kalyan mahesh babu

ఆ తర్వాత అల్లు అర్జున్‌ (15.67 కోట్లు), రామ్‌చరణ్‌ (14 కోట్లు), లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు. 112.8 కోట్లతో దీపికా పదుకోన్‌ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్‌ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్‌ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్‌ రికార్డ్‌ సృష్టించారు. సౌత్‌ నుంచి హీరోయిన్స్‌లో నయనతార 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు.