ఆదితో ఆర్ ఎక్స్ -100 త‌మిళ్ లో ఫిక్స్

397

తెలుగులో ఇటీవ‌ల విడుద‌ల అయ్యి ఘ‌న విజయం సాధించిన ఆర్ ఎక్స్ -100 సినిమాని ఇప్పుడు త‌మిళ్ లో రీమేక్ చేస్తున్నారు…మిరుగం ఈరం మరకదనానయం… తదితర చిత్రాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆది.. తమిళ వెర్షన్‌లో హీరోగా నటించనున్నారు. దీంతో ఈ సినిమా పై ఇప్ప‌టికే కోలీవుడ్ మార్కెట్ పై పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది… తెలుగులో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఈ చిత్రం పై ఇప్ప‌టికే త‌మిళ‌నాట కూడా చ‌ర్చించుకున్నారు.

Image result for tamil adhi
రామ్‌గోపాల్‌వర్మ అసిస్టెంట్ ద‌ర్శ‌కుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన ‘ఆర్‌ఎక్స్‌ 100 బోల్డు లవ్‌స్టోరీ యువతను విపరీతంగా ఆకర్షించింది. అర్జున్‌రెడ్డి తరువాత ఆ స్థాయి క్రేజ్‌ సంపాదించడంతో రీమేక్‌ చేసేందుకు ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా తెరకెక్కించేందుకు బీటౌన్ నిర్మాత‌లు రెడీ అవుతున్నారు. ఇక పాయ‌ల్ రాజ్ పుత్ హాట్ సీన్స్ అద‌ర‌గొట్టింది.. ఇలా లిప్ లాక్ సీన్స్ న‌టించేందుకు మ‌రి ఎవ‌రు త‌మిళ్ లో రెడీ అవుతారు అనేది చూడాలి.. ఈ సినిమాని అక్టోబ‌ర్ లో ప్రారంభించాలని చూస్తున్నారు.