ఫైర్ బ్రాండ్ హేమ సినీ పరిశ్రమ నుంచి ఔట్…కారణం తెలిస్తే షాక్

268

తెలుగు సినీ పరిశ్రమలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో చురుకుగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు మద్దతుగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటున్న ఆమె… ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో నటిగా, నాయకురాలిగా రాణిస్తూ వస్తున్న ఆమె త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హేమ ఈ ప్రకటన చేశారు. సినిమాల్లో ఆదరిస్తున్నట్లే రాజకీయాల్లోనూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Image result for actress hema

హేమ సినీ ప్రపంచంలో ఒక మంచి నటిగా గుర్తింపు పొందారు. బ్రహ్మానందం వంటి టాప్ కమెడియన్ లతో కలిసి చాలా సినిమాల్లో తన కామెడీతో గిలిగింతలు పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు క్యారెక్టర్ లు చేసిన హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా ‘ లో కూడా కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను మెప్పించిన హేమ రాజకీయాల్లో ఇప్పటి వరకు పలు ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యారు. ఇక ఇప్పుడు వైసీపీలో చేరిన హేమ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు .

Image result for actress hema

తాను ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన హేమ ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాపుల కోసం బడ్జెట్‌లో రెండువేల కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమన్నారు. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసేలా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా హేమ చెప్పారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పోటీచేసిన హేమ ఓటమిపాలయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ ఉద్యమంలో నాయకురాలిగా కూడా హేమ పని చేశారు . కాపు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ముద్రగడకు హేమ మద్ధతు పలికారు. హైదరాబాద్‌లో జరిగిన కాపు సంఘం ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు అంతా చేసినా హేమకు మాత్రం రాజకీయాలు కలిసి రాలేదు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమై మళ్లీ సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నారు.

Image result for actress hema

హేమ కొంతకాలంగా తన కాపు కమ్యూనిటీ తరుపున వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఏపీ బడ్జెట్లో కాపుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నందున రాజమండ్రిలోనే సెటిలవ్వాలని డిసైడ్ అయినట్లు హేమ తెలిపారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో సొంతగా ఇల్లు కట్టుకుంటున్నట్లు, ఇకపై తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడంతో పాటు కాపుల సమస్యలపై పోరాటం చేయబోతున్నట్లు తెలిపారు.

అందరికి షేర్ చేయిండి

నా సినీ పరిశ్రమను, హైదరాబాద్‌లో ఉంటున్న నా ఫ్యామిలీని వదిలి నేను ఉండగలనా? లేదా? మీరు(ప్రజలు) నన్ను రమ్మంటున్నారా? లేదా? అనేది నాకు తెలియడం లేదు. వీటిపై నాకు సరైన క్లారిటీ రావాలనే ఒక అడుగు ముందుకు వేసి సినీ పరిశ్రమను వీడి బయటి ప్రపంచంలోకి వస్తున్నట్లు హేమ స్పష్టం చేశారు. హేమ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. వైసీపీ తరుపునే ఆమె రాజకీయాలు చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో హేమ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరుపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కొత్తగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌లో హేమ కీలకమైన ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరి హైదరాబాద్ వదిలి రాజమండ్రికి షిప్ట్ అవుతున్న తరుణంలో ఆమె ‘మా’కు కూడా దూరం అవుతారా? లేక ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. హేమ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..