త్వరలో సినిమాలకు గుడ్‌బై..రామ్ లక్ష్మణ్..

310

ప్రకాశం జిల్లా కారం చేడు గ్రామంలో చిన్న మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఫైట్‌ మాస్టర్స్‌ రామలక్ష్మణ్‌ బ్రదర్స్‌ సినీ రంగ ప్రవేశం చేసి 31 సంవత్సరాలు అయింది. 1987లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇప్పటివరకు 1100 సినిమాలకు పైగా ఫైట్‌ మాస్టర్లగా పనిచేశారు.తెలుగు, కన్నడ, మళయాల తమిళ, హిందీ, సినిమాలలో ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు.

Image result for ram laxman fight masters

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్‌సింగ్‌, ఖైదీనెంబర్‌ 150, సినిమాలు గుర్తింపు తెచ్చాయి.ఇప్పుడు చిత్ర పరిశ్రమలోని తెలుగు హీరోలందరికీ ఫైట్ మాస్టర్స్‌గా చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు, చిరు 151 సినిమాకి పనిచేస్తున్నారు.

Image result for ram laxman fight masters

అయితే ఇప్పుడు ఈ అన్నదమ్ములు అభిమానులకు షాకింగ్ విషయం చెప్పారు.త్వరలోనే తాము సినిమాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత పల్లెటూరు వాతావరణంలో పచ్చటి ప్రకృతి నడుమ ఇంటిని నిర్మించుకుని ప్రశాంత జీవితం సాగించాలని కోరుకుంటున్నారట.తాము పుట్టిపెరిగిన కారంచేడులో చిన్నచిన్న సేవాకార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతారట.