అదే మ‌మ్మ‌ల్ని క‌లిపింది సోన‌మ్

372

బాలీవుడ్ బ్యూటీ సోన‌మ్ క‌పూర్, ఆనంద్ అహుజ వివాహం ఎంత గ్రాండ్ గా జ‌రిగిందో తెలిసిందే…రెండు నెల‌ల క్రితం వీరు ఇద్ద‌రూ వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు.. వీరి ఇద్ద‌రికి వివాహం అయితే త‌ర్వాత, ప్ర‌తీ విష‌యాన్ని త‌మ అభిమానుల‌కు పంచుకుంటున్నారు.. బాలీవుడ్ లో సోన‌మ్ కు విప‌రీత మైన క్రేజ్ ఉంది.. సోన‌మ్ క‌పూర్ అంటే ఫ్యాష‌న్ కు ఐకాన్ అనే చెప్పాలి… ఆనంద్‌ అహుజా కూడా ఫ్యాషన్‌ ప్రియుడే వీరి ఇద్ద‌రిని బ‌హుశా ఇదే క‌లిపింది అంటారు..

Related image

అయితే అది నిజం అంటోంది సోన‌మ్.. ఈ విషయం గురించి సోనమ్‌ తన ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు…నాకు ఫ్యాష‌న్ అంటే ఎంతో ఇష్టం.. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే.. నాకు ఆనంద్ కు వివాహం సెట్ కావ‌డానికి ఇదే కార‌ణం త‌న‌ని అందుకే లైన్ చేశా త‌న అభిరుచులు నా అభిరుచులు క‌లిశాయి.

Image result for sonam kapoor wedding

ఆనంద్‌ ఫ్యాషన్‌ రంగంలో, రిటైల్‌ రంగంలో స్థిరపడిన వ్యక్తి కాబట్టి నాకు తొందరగా నచ్చాడు. ఫ్యాషన్‌ పట్ల ఉన్న ఆసక్తి వల్లే మేము ఇద్దరం వివాహం చేసుకున్నాం అంటూ ట్వీట్‌ చేశారు… ఆనంద్‌ అహుజా ఢిల్లీకి చెందిన రిటైల్‌ వ్యాపారి. అంతేకాక దేశంలో తొలి మల్టీ బ్రాండ్ స్నీకర్ బోటిక్‌ను ప్రారంభించింది కూడా ఆనంద్‌ అహుజానే…. దీంతోపాటు భనే అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.. రిటైల్ వ్యాపారంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆయ‌న‌… మొత్తానికి వీరి వివాహ బంధానికి ఇలా అభిరుచులు బాగా క‌లిశాయి అని అంటున్నారు.