అభిమానులు కాస్త ఓపిక‌గా ఉండండి -బ‌న్నీ ట్వీట్

372

బ‌న్నీ ఇటీవ‌ల త‌న సినిమాతో ఫ్యాన్స్ ని మెస్మ‌రైజ్ చేశారు …నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఆయ‌న న‌ట‌న‌కు మంచి పేరు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి… త‌ర్వాత ఆయ‌న గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ సారి సినిమా ప్రకటనను కాస్త ఎక్కవ గ్యాపే తీసుకున్నాడని భావించిన ఫ్యాన్స్ ఈ విషయమై బాగా చర్చలు జరుపుతున్నారు.ఇక ఆ య‌న సినిమాపై ఇప్ప‌టికే ఫ్యాన్స్ ఆయ‌న ఎటువంటి సినిమా చేయ‌నున్నారు అని ఎదురుచూస్తున్నారు.

Image result for alluarjun

ఇక ఈ విష‌యంలో రోజూ దీనిపై చ‌ర్చించుకోవ‌డం సోష‌ల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ మాట్లాడుకోవ‌డంతో ఇప్పుడు బ‌న్నీ తాజ‌గా ఈ విష‌యం పై ట్వీట్ట‌ర్ లో స్పందించారు….ఫ్యాన్స్‌ని ఓపికగా ఉండమంటూ సలహా ఇచ్చాడు…..మై డియర్ ఫ్యాన్స్.. మీ ప్రేమకు థాంక్యూ సోమచ్. నా నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ కోసం కాస్త ఓపికగా వెయిట్ చెయ్యండి. ఎందుకంటే నేను కాస్త సమయం తీసుకోవాలనుకుంటున్నాను. నేను జెన్యూన్‌గా ఓ మంచి సినిమాను అందించాలనుకుంటున్నాను.

Image result for alluarjun

టైమ్ పడుతుంది. అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని ట్వీట్‌లో పేర్కొన్నాడు బన్నీ.దీంతో కొ్త్త ప్రాజెక్ట పై బ‌న్నీ కాస్త స‌మ‌యం తీసుకుంటున్నారు అంటే పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు బ‌న్నీ అభిమానులు.. ఇప్పుడు ఈ వార్త‌ని ట్వీట్ రూపంలో వైర‌ల్ చేస్తున్నారు.