BREAKING NEWS : ప్రముఖ దర్శకుడు మృతి..

1043

సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య చాలా మంది నటినటులు చనిపోతున్నారు.ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.కొందరు సమస్యలు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఈ మద్య ఇలా చాలా మంది సినీ ప్రముఖులు చనిపోయారు.ఇటు తెలుగు ఇండస్ట్రీ లో అటు తమిళ ఇండస్ట్రీ లోని అగ్ర నటులు దర్శకులు చనిపోయారు.అయితే ఇప్పుడు మరొక ప్రముఖ దర్శకుడు చనిపోయాడు.మరి ఆయనేవారు ఎలా చనిపోయాడో తెలుసుకుందామా.

తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన డైరెక్టర్ సి.శివకుమార్ ఇక లేరు.సి. శివకుమార్ అనుమానాస్పద పరిస్థితుల మధ్య మృతి చెందారు. చెన్నై లోని తన నివాసంలో ఆయన మృతి చెందడం సంచలనం రేపుతోంది.చెన్నైలోని సాలిగ్రామంలో గల ఓ అపార్ట్ మెంట్ లో శివ కుమార్ నివాసం ఉంటున్నారు. తాజాగా ఆయన మృతి చెందిన విషయం తెలియడంతో చెన్నై పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. శివకుమార్ మృత దేహం కుళ్లిపోయి కనియించింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక మర్డర్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.శివకుమార్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇంత వరకు అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. శివకుమార్ మృతి చెంది శవం కుళ్ళే వరకు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాధమికంగా ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు.ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కు పంపారు.శివకుమార్ మరణానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.

ప్రస్తుతం తమిళంలో అజిత్ క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. అజిత్ కెరీర్ ఆరంభంలో శివకుమార్ దర్శత్వంలో నటించాడు. అజిత్, రాశి నటించిన రెట్టయి జాడి వయసు చిత్రానికి శివకుమార్ దర్శకత్వం వహించారు.అర్జున్ నటించిన ఆయుధ పూజై చిత్రానికి కూడా శివకుమారే దర్శకుడు.ఈయన తీసిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.అర్జున్ నటించిన ఆయుద పుజై సినిమా తెలుగులో ఆయుద పూజగా విడుదల అయ్యింది.ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ సినీప్రముఖులు షాక్ కి గురవుతున్నారు..శివకుమార్ మృతి చెందడంతో తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తోంది.తెలుగు హీరోలు చిరంజీవి,వెంకటేష్,పవన్ కళ్యాణ్,తెలుగు దర్శకుల సంఘం ఆయన మృతికి నివాళులు అర్పించింది.మరి మనం కూడా కామెంట్ రూపంలో నివాళులు అర్పిద్దాం.

కాపులు ఈరీజ‌న్ తో జ‌గ‌న్ ని న‌మ్ముతున్నారు ?