వేధింపులను ఎదుర్కొంటున్న ప్రముఖ నటి..కేసు నమోద్

405

దేశంలో అడుగడుగునా ఆడపిల్లల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.వారిని అసభ్య పదజాలంతో దూషించడం లేదా వారి మీద రాక్షసులుగా పడి అత్యాచారం చెయ్యడం లాంటివి చేస్తూనే ఉన్నారు.కొందరు ప్రేమ అని చెప్పి అమ్మాయికి ఇష్టం లేకున్నా సరే పెళ్లి చేసుకో అని వేధిస్తుంటారు.దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదని చెప్పడానికి ఉదాహరణగా ఎన్నో ఘటనలు జరిగాయి.కొంతమంది ఆ దాడుల నుంచి తప్పించుకున్న వాళ్ళు ఉన్నా బలైన వారు ఎందరో ఉన్నారు.ఇప్పుడు కూడా ఒక నటి ఇలాంటి పరిస్త్త్తులనే ఎదుర్కొంటుంది.పెళ్లి చేసుకో అని ఆ నటిని ఒకడు వేధిస్తున్నాడు.మరీ ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for నీలాణి

బుల్లితెర నటి నీలాణి టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ పేరు తెచ్చుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరిగిన స్టెర్‌లైట్‌ ఉద్యమంలో పోలీసుల దుస్తుల్లో నీలాణి పాల్గొనడం వివాదాస్పదమైంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన నటి నీలాణి మళ్లీ తన పనుల్లో బిజీగా ఉంది.అయితే గాంధీ లలిత్‌కుమార్‌ అనే వ్యక్తితో ఆమెకు మూడేళ్ల కిందట పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి మధ్య మనస్పర్థల కారణంగా కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నటి నీలాణి ఆదివారం స్థానిక మైలాపూర్‌లో జరుగుతున్న ఓ సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొంది. షూటింగ్ స్పాట్‌కు వచ్చిన లలిత్ కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని నీలాణిని అడిగగా అందుకు ఆమె నిరాకరించింది.దీంతో చిర్రెత్తుకొచ్చిన గొడవకు దిగి బూతులు తిడుతూ నానా రాద్ధాంతం చేసినట్లు సమాచారం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో టీవీ సీరియల్‌ షూటింగ్‌లో కలకలం చెలరేగింది. ప్రియుడి వేధింపులు భరించలేదని నటి ఆదివారం పోలీసులను ఆశ్రయించి లలిత్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. అతడితో తనకు మూడేళ్ల పరిచయం ఉందని, తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. అయితే మనస్పర్థల కారణంగా ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్నానని, అతడిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని అయినా పెళ్లి చేసుకోవాలని షూటింగ్ స్పాట్‌కు వచ్చి వేధిస్తున్నాడని నీలాణి తన ఫిర్యాదులో పేర్కొంది.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.విన్నారుగా ఇష్టం లేదని చెప్పినా పెళ్లి చేసుకోమని ఎలా వేదిస్తున్నాడో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఆడపిల్లల మీద దేశంలో జరుగుతున్న అమానుష దాడుల గురించి అలాగే ఈ నటి ఎదుర్కొంటున్న సమస్య గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.