ఎఫ్2 సెకండ్ సాంగ్ రిలీజ్.. పెళ్లి గెటప్పుల్లో వెంకీ, తమన్నా సూపర్..

238

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. మిల్కి బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అనిల్ రావిపూడి దర్శకుడు.దిల్ రాజు నిర్మాత.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Second song from Venkatesh and Varun Tej F2 is released

ఇప్పటికే విడుదలైన ఎఫ్2 టీజర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి తోడల్లుళ్లుగా వస్తున్న వెంకీ, వరుణ్ తేజ్ రచ్చ ఏవిధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే విడుదల అయినా ట్రైలర్ మొదటి పాట సినిమా మీద అంచనాలను పెంచింది.

అయితే తాజాగా ఈ చిత్ర రెండవ పాటని విడుదల చేశారు.రెండవ పాట కోసం దేవిశ్రీమంచి మెలోడీ ట్యూన్ అని అందించారు. ఎంతో ఫన్ అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీనే పాడాడు. తమన్నా, వెంకీ మధ్య జరిగే పెళ్లి సీన్, కొత్త కాపురం నేపథ్యంలో ఈ పాట ఉండనున్నట్లు వీడియో ద్వారా అర్థం అవుతోంది. తమన్నా, వెంకీ ఈ పాటలో రొమాంటిక్ స్టెప్పులతో అలరించనున్నారు.