100 కోట్ల క్లబ్ లో చేరిన ఎఫ్2..

267

సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా ఎఫ్2. ఎన్నో రోజుల తర్వాత తెలుగులో వచ్చిన కామెడీ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.సంక్రాంతి అల్లుళ్లుగా వెంకీ, వరుణ్ చూపించిన ఫ్రస్టేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.అంతేగా అంతేగా అంటూ చేసిన కామెడీకి జనం నీరాజనాలు పట్టారు.

Image result for f2 movie

ఎన్నో రోజుల తర్వాత వెంకటేష్ కామెడీ చెయ్యడం అలాగే వరుణ్ తేజ్ తొలిసారిగా కామెడీ చెయ్యడం ప్రేక్షకులకు తెగ నచ్చింది.హీరోయిన్స్ తమన్నా మెహరీన్ అందాలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

F2’ అప్పుడే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. సంక్రాంతి అల్లుళ్లు రూ.వంద కోట్లు రాబట్టారంటూ నిర్మాత సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వంద కోట్ల క్లబ్ లో చేరినందుకు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు.