వైఎస్ జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్?

347

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘యాత్ర’ అనే టైటిల్ మీద ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్రను చేస్తున్నాడు.అయితే ఇప్పుడు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి పాత్ర మీదనే పలు వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్ పాత్ర కోసం నటుడి ఎంపిక వ్యవహారం ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్ర విషయంలో ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి.

Image result for ys yaatra movie

తమిళనటుడు సూర్య వైఎస్ జగన్ పాత్రను చేయబోతున్నాడని మొదట ఆపై సూర్య తమ్ముడు కార్తీ ఆ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. జగన్ పాత్రను విజయ్ చేస్తాడని వెబ్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది.అవేవీ నిజం కాలేదు ఇంత వరకూ.ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.అదలా ఉంటే ఇప్పుడు ఈ పాత్ర విషయంలో మరో పేరు కూడా వినిపిస్తోంది.

Related image

మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌ను జగన్‌గా చూపించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. తండ్రి పాత్రలో మమ్ముట్టీ, తనయుడి పాత్రలో దుల్కర్‌లో నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.ఈ విషయం బాగా ప్రచారం జరుగుతోంది.ఓవరాల్‌గా జగన్ పాత్రలో నటింపజేయడానికి తగిన హీరో కోసం ‘యాత్ర’ రూపకర్తల ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని సమాచారం. ఈ సినిమా జగన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాబోతోంది.