వినయ విధేయ రామలో అదిరిపోయే మాస్ సాంగ్…

289

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Devi Sri prasad composed mass song for Vinaya Vidheya Rama

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ను ఈ మధ్యనే విడుదల చేశారు.బోయపాటి అంటే మాస్ యాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్.. ఆయన మార్క్ కనిపించే విధంగా రామ్ చరణ్‌ను మెగా మాస్ లుక్‌లో చూపించారు.రామ్ చరణ్ ను పూర్తి స్థాయిలో చేంజ్ చేసి తనదైన శైలిలో కత్తి పట్టించి పరుగు పెట్టిస్తున్నారు.అయితే ఈ చిత్రం గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో కోడై కూస్తుంది.

అదేమిటి అంటే..ఈ సినిమాలో ఒక ఊరమాస్ సాంగ్ ఉండబోతుందంట.బోయపాటి దేవిశ్రీ ప్రసాద్ అంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళు.అందుకే ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంది.దానికి ఇంకొంచెం హైప్ తీసుకురావడానికి ఈ సినిమాలో ఒక ఊరమాస్ సాంగ్ పెట్టబోతున్నారంట.త్వరలో రాంచరణ్, కైరా అద్వానీపై బోయపాటి అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ ని చిత్రీకరించనున్నారట. దేవిశ్రీ ప్రసాద్, బోయపాటిది సూపర్ హిట్ కాంబినేషన్. అద్భుతమైన ఆల్బమ్ ని దేవిశ్రీ నుంచి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.