దీప్తికి నూత‌న్ కు గాయాలు బిగ్ బాస్ హౌస్ లోకి డాక్ట‌ర్ కన్నీరు పెట్టిన ఇంటి స‌భ్యులు

470

బిగ్ బాస్ సీజ‌న్ లో స‌గం ఎపిసోడ్స్ ఇప్ప‌టికే ముగిసిపోయాయి… నాని అన్న‌ట్లుగానే మ‌రింత మ‌సాలాతో పాటు క‌ఠిన‌మైన టాస్క్ లు ముందు ముందు ఉంటాయి అన‌డంలో ఏ సందేహాం లేదు.. ఇక నామినేష‌న్లు కూడా సిల్లీ క‌బుర్లు చెబుతూ చేయ‌డానికి లేదు అని, క‌రెక్ట్ విష‌యం ఉండాలి అని చెప్ప‌డంతో నిజంగా హౌస్ అటువంటి అట్మాస్పియ‌ర్ ను నింపుకుంది.

Image result for big boss nutan naidu and deepthi

బిగ్‌బాస్ సీజన్ సగం ముగియడంతో నామినేషన్ ప్రక్రియని కఠినతరం చేశారు అనేలా, తాజా ఎపిసోడ్ లో ప్రేక్ష‌కుల‌కు కంటెస్టెంట్స్ కు అర్ద‌మైంది. దీంతో హౌస్‌లో చాలా మంది కంటెస్టెంట్స్‌ గాయాలపాలయ్యారు. ఎపిసోడ్ 58లో ముందు ఇంటి స‌భ్యులు అంద‌రూ బోనాల పండుగ సందర్భంగా హౌస్‌ని పూలతో ముస్తాబుచేశారు. తర్వాత నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు పోటీపడుతూ ఒకరితో మరొకరు దురుసుగా ప్రవర్తించారు. దీంతో.. బిగ్‌బాస్‌లో మళ్లీ కొత్త గొడవలు మొదలయ్యాయి.

Image result for big boss nutan deepthi telugu

ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరిగాయి. హౌస్‌లోని గార్డెన్‌లో ఓ టెంట్‌ని ఏర్పాటు చేసిన బిగ్‌బాస్.. మ్యూజిక్ ప్లే అయ్యే సమయంలో కంటెస్టెంట్స్ అందర్నీ ఆ టెంట్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లాలనే టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఆఖర్లో టెంట్‌లోకి ప్రవేశిస్తారో.. వారు నామినేట్ అయినట్లు ప్రకటించాలని కెప్టెన్ పూజా రామచంద్రన్‌‌కి సూచించాడు. ఈ నామినేషన్ నుంచి కెప్టెన్‌గా ఉండటంతో పూజా, రెండు వారాల సేవ్ కార్డ్ ఉండటంతో అమిత్‌కి మిన‌హాయింపు ఇచ్చారు బిగ్ బాస్ .. ఈ టాస్క్ లో ఆరు సార్లు మొత్తం మ్యూజిక్ ప్లే అయ్యింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముందు మ్యూజిక్ వచ్చినప్పుడు కంటెస్టెంట్స్‌ పరుగెత్తగా.. బాబు గోగినేని చివరిగా టెంట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తనీశ్, గీతా మాధురి, శ్యామల, గణేశ్, దీప్తి చివరిగా టెంట్‌లోకి వెళ్లి నామినేషన్స్‌లో నిలిచారు. వాస్తవానికి తనీశ్ లోపలికి వెళ్లిపోతుండగా.. అతని వెనుక చివరిలో దీప్తి సునైనా వస్తుండటంతో ఆమె కోసం అలానే టెంట్‌లోకి వెళ్లకుండా త్యాగం చేశాడు. ఈ టాస్క్‌లో బాబు గోగినేని మినహా మిగిలిన వారందరూ చాలా ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా.. శ్యామల, దీప్తి, నూతన నాయుడికి గాయాలయ్యాయి. దీప్తి కాలికి తీవ్ర గాయమవడంతో డాక్టర్ వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. ఆఖర్లో దీప్తి, రోల్ రైడాలో ఎవరు ముందు టెంట్‌లోకి ప్రవేశించారు..అనేదానిపై సందిగ్ధత నెలకొంది.చివ‌రకు కెప్టెన్.. రోల్‌రైడ్‌ వైపే మొగ్గు చూపింది. దీంతో ఈ వారం నామినేషన్‌లోకి . బాబు గోగినేని, తనీశ్, గీతా మాధురి, గణేశ్, శ్యామల, దీప్తి నిల‌బ‌డ్డారు. చూడాలి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేష‌న్ ఎవ‌రు అవుతారో.