నటి అశ్విని గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే అస్సలు పోల్చుకోలేరు..

319

ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా అంతరంగాలు కళంకిత ఓ కళంకిత అనే పాటలే వినవచ్చేవి..పలానా సమయానికి ఠక్కున ఆ సీరియల్స్ ముందు కూచొని కన్నీళ్ళు కార్చేసేవాళ్ళు ఆడవాళ్ళు..అప్పట్లో ఒక నానుడి ఉండేది..ఉల్లిపాయ టివి సీరియల్స్ తప్ప ఆడవాళ్ళ కంట కన్నీరు తెప్పించేవారు లేరు అని..భర్త ఇతర బంధువులను ముప్పుతిప్పలు పెట్టే ఆడవాళ్ళు టివి సీరియల్స్ దెబ్బకు ఢంగయిపోయి మొహం సీరియస్ గా పెట్టి ఒక రకమైన హిస్టీరిక్ గా ఉండేవరు..వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ను బట్టి ఆ సీరియల్ లో ఫలానా క్యారక్టర్ కు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని గుర్తించేవారు..అంతగా టివి సీరియల్లకు అతుక్కుపోయేవారు..అలాంటి టివి సీరియల్స్ లో ఈటివి లో వచ్చే అంతరంగాలు, కళంకిత సీరియళ్ళు అతి ముఖ్యమైనవి.. ఈ రెండు సీరియల్స్ లో ప్రధాన పాత్ర అశ్వినిదే..

Image result for నటి అశ్విని

అశ్విని అప్పట్లో ఇంటింటి ఆడపిల్ల..అవడానికి మళయాళీ అయినా ఇక్కడి ఆడవరిని తెగ ఏడిపించేది ఈ బుల్లితెర భామ..అచ్చం తమ పక్కింటి ఆడపిల్ల తమ టివి లో చేరి తమ మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసేదని గట్టిగా నమ్మేవాళ్ళు తెలుగు మహిళా ప్రేక్షకులు..అశ్విని అసలు పేరు రుద్ర..ఈమె మొదటి చిత్రం పుదినెల్లు..పుదినాట్టు..ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మరెవరో కాదు..ప్రముఖ దర్శకుడు భారతీ రాజా..ఈమె తన స్కూల్ ఎండింగ్ డేస్ లో రెండు మూడు యాడ్ వెంచర్లు చేయగా వాటిని గుర్తుపట్టిన భారతీ రాజా ఈమెకు తన చిత్రంలో చాన్స్ ఇచ్చారు..నెపోలియన్ సుకన్యలకు కూడా ఇది మొదటి సినిమానే..తౌర్వాతై కాలంలో అశ్విని మళయాళ తమిళ చిత్రాల్లో ఎక్కువగా చేసింది..తెలుగులో జయసుధ తో కలిసి ఆంటీ..చిరంజెవి చెల్లెలు గా హిట్లర్ తరువాత శ్రీహరి తో కలిసి పోలీస్ అనే చిత్రాల్లో మాత్రమే చేసింది అశ్విని..

ఈ క్రింది వీడియో చూడండి

1191 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో సుమారు 25 చిత్రాలవరకూ చేసిన అశ్విని తరువాతి కలంలో సీరియళ్ళకు షిఫ్ట్ అయిపోయింది..కధమట్టుకు కధనార్..అమ్మకానికో అమ్మాయి అంతరంగాలు కళంకిత విడుదలయి చిన్న చిన్న ఆశై అంతర్నేత్రం వంటి సీరియల్స్ లో చేసింది.. వీటన్నిటిలో తెలుగులో వచ్చిన అంతరంగాలు కళంకిత అశ్విని ఎంతో మంచి పేరును సాధించి పెట్టాయి..తరువాతి కాలంలో చానల్లు పెరగడం కొత్త కొత్త ఆర్టిస్టులు రంగ ప్రవేశం చేయదంతో అశ్విని ప్రభ తగ్గిపోతూ వచ్చింది..కాని అశ్విని తొలినాటి సీరియళ్ళలో ఎంతగానో ప్రభావితం చేసిన నటిగా గుర్తింపు సాదించింది..టివి సీరియళ్ళకు జనం ఇంతలా అతుక్కుపోతున్నారు అంటే అదంతా అశ్విని లాంటి నటీమణుల కృషే..అప్పట్లో వీరంతా డెడికేటెద్ గా చేయడం వలనే సీరియళ్ళ సంఖ్య వాటిని చూసేవారు బాగా పెరిగారు..

Related image

అలాంటి అశ్విని తరువాతి కాలంలో సింగపూర్ వెళ్ళి సెటిల్ అయిపోయింది.. సింగపూర్లో అశ్విని హాయిగా తిని కూచోలేదు..అక్కడి సీరియల్స్ లో నటిస్తూ యమ బిజీగ ఉన్నారు..అలా తమిళంలో భారతీ రాజా చిత్రంతో తెరంగేట్రం చేసి తరువాత ఈటివి సుమన్ అంతరంగాలు, కళంకిత వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది..తరువాతి కాలంలో సింగపూర్ వెళ్ళి సెటిలయి అక్కడ సెరియళ్ళు చేస్తోంది అశ్విని..అంటే అక్కడ కూడా మహిళా ప్రేక్షకుల చేత కన్నీటి ప్రవాహం కంటిన్యూ చేయిస్తుంది అన్నమాట..సీరియల్ తార అశ్విని ఇప్పుడెలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..