ప్రభాస్ చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలుసా..

1004

బాహుబలితో దేశం మొత్తం మారుమోగిపోయిన ప్రభాస్ పేరు.. ఇప్పుడు సాహోతో మరోసారి మారుమోగుతోంది. శ్రద్దా కపూర్-ప్రభాస్ జోడీగా సుజిత్ దర్శకత్వంలో, యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ – ప్రమోద్ఏ-విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 30న సాహో విడుదల కాబోతోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో సాహో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Image result for prabhas watch

సాహో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చాలామంది కళ్లు ప్రభాస్ చేతికి ఉన్న ‘వాచ్’పై పడ్డాయి. ప్రభాస్ ధరించిన వాచ్ గురించి సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వాచ్ ధర ఎంత ఉంటుందోనని అంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రభాస్ ధరించిన ఆ వాచ్ పేరు.. హబ్లట్. అత్యంత ఖరీదైన ఈ వాచ్‌లను ఎక్కువగా హాలీవుడ్ నటీనటులు వాడుతుంటారు. ప్రభాస్ ధరించిన ఆ హబ్లట్ వాచ్ ధర సుమారు రూ.15లక్షల నుంచి రూ.1కోటి వరకు ఉండవచ్చునని అంటున్నారు. ప్రభాస్ చేతికి ఆ వాచ్ భలే ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక సాహో తర్వాత ప్రభాస్ ఏ చిత్రంలో నటిస్తాడా అని అభిమానులు ఎదుచూస్తున్నారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. జిల్ సినిమా ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు తెలుస్తోంది. కథ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం 1970 నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యేలా ఈ చిత్రం ప్రేమ కథగా సాగుతుందట. 1970 నాటి పరిస్థితులకు అనుగుణంగా దర్శకుడు సెట్స్ విషయంపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఒక తమిళ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మంచి కథ ఉంటే డైరెక్ట్‌గా ఒక తమిళ సినిమా చేస్తానన్నారు. గతంలో ప్రభాస్.. ‘బుజ్జిగాడు’ మేడిన్ చెన్నై అంటూ ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ప్రభాస్.. రజినీకాంత్‌ ఫ్యాన్ గా అలరించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ప్రభాస్.. డైరెక్ట్‌గా తమిళ సినిమా చేస్తా అని ప్రకటించడంతో తమిళనాడులోని ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.