దానగుణంలో అందరు స్టార్లను మించిపోయాడు.కేరళకు లారెన్స్ విరాళం ఎంతో తెలుసా..

441

వరదలతో అతలాకుతలం అయిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే వరద నష్టం మాత్రం భారీగా ఉంది. ప్రకృతి ప్రకోపానికి లక్షల మంది ప్రభావితం అయ్యారు. వేల మంది తమ ఇళ్లను కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వరుణుడి బీభత్సానికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, స్వచ్ఛమైన నీరు దొరకక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్లు, ప్రజలు తమ వంతు సహయంగా విరాళాలు ప్రకటించడంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.ఇప్పుడు రాఘవ లారెన్స్ కూడా తనవంతు సాయం చేశాడు.మరి ఎంత డబ్బు సహాయంగా అందించాడో చూద్దామా.

Image result for raghava Lawrence

చాలా మంది ప్రముఖ హీరోలు రూ. 5 లక్షలు మొదలుకుని రూ. 25 లక్షల వరకు డొనేషన్స్ ఇచ్చారు. సౌతిండియా మొత్తంలో తమిళ స్టార్ విజయ్ ఇప్పటి వరకు అత్యధికంగా రూ. 70 లక్షల సహాయం అందించారు. అయితే తాజాగా హీరో, దర్శకుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఏకంగా రూ. 1 కోటి విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.కేరళకు రూ. 1 కోటి సహాయం అందించబోతున్నట్లు లారెన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. కేరళకు కోటి రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. కేరళలో ఉన్న మన సోదరులు, సోదరీమణులు వరదల వల్ల ఎంతో కోల్పోయారు. వారికి సహాయం చేయాలనుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు.

Image result for raghava Lawrence

అక్కడి పరిస్థితులను చూశాక సహాయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలని, ప్రజలకు నేరుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. కొన్ని రోజుల ముందే వెళ్లాలనుకున్నాను. కానీ వర్షాల కారణంగా అక్కడ రావొద్దని చెప్పారు. ఇపుడు వర్షాలు తగ్గాయి కాబట్టి స్వయంగా ప్రభుత్వ అధికారులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అని తెలిపారు.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అపాయింట్మెంట్ శనివారం దొరికింది. ఆ రోజు నేరుగా ఆయన్ను కలిసి విరాళం అందజేస్తాను. ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతాను. కేరళను ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని రాగవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను అని లారెన్స్ వెల్లడించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ డబ్బు కాకుండా ఇంకా నేనేమి చెయ్యాలో చెప్పండి చేస్తా అని అభిమానులను కోరుతున్నాడు లారెన్స్.లారెన్స్ చేస్తున్న సహాయం చూసిన నేటిజన్స్ అతని మంచి మనసును మెచ్చుకుంటున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటారు.కేరళ వరద బాదితుల పరిస్థితి గురించి అలాగే వారి సహాయం కోసం వస్తున్న విరాళాల గురించి రాఘవ లారెన్స్ చేసిన సాయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.