విజయనిర్మల సంపాదించిన ఆస్తిలో మహేష్ బాబుకి ఎంత వాటా రాసిందో తెలుసా?

3701

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ సినీ చరిత్రలో ఏ మహిళా దర్శకురాలికి సాధ్యంకాని అరుదైన గుర్తింపు పొందిన విజయ నిర్మలకు మన అందరిని వదిలివెళ్లిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల మరణంతో ఘట్టమనేని వంశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె భర్త కృష్ణ ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఈ సమయంలో ఆయన పరిస్థితి చూసినవారందరూ కంటతడి పెట్టుకుంటున్నారు..

Image result for vijaya nirmala

అయితే ఇప్పుడు విజయనిర్మల వీలునామా బయటపడింది. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆమె ముందుగానే తన వీలునామా రాసిపెట్టింది. విజయనిర్మల పేరుమీద చాలా ఆస్తులు ఉన్నాయి. విజయనిర్మల ఆ రోజుల్లోనే నానక్ రామ్ గూడలో మంచి పెట్టుబడులు పెట్టారు. ఆనాటి తరం తారలతో అందరి కంటే విజయనిర్మల ఆర్థికంగా బలంగా ఉన్నారు. వృద్ధాప్యంలో ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి ముందే జాగ్రత్త పడ్డారు. ఆమెకు వారసత్వంగా వచ్చిన ఒక ఇల్లు ఉంది. అందులో ఆమె అన్నలకు ఈమెకు భాగం ఉంది. ఆ ఇల్లు చెన్నైలో ఉంది. అలాగే నానక్ రామ్ గూడలో ఉన్న ఇల్లు ఆమె పేరు మీదనే ఉంది. పక్కనే విప్రో ఉండడంతో అక్కడ ఐటి చాలా డెవలప్ అవుతుంది. ఈ ఇల్లు దగ్గర దగ్గర 40 కోట్ల వరకు పలుకుతుంది. అలాగే చిలుకూరు దగ్గరలో ఒక ఫార్మ్ హౌస్ ఉంది. దాని విలువ కూడా 20 కోట్ల వరకు ఉంటుంది. అలాగే ఫిలిం నగర్ లో ఒక ఇల్లు ఉంది. దీని విలువ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే ఈమె పేరు మీద దాదాపు 20 ఎకరాల పొలం ఉంది. దీని విలువ కూడా కోట్లలో ఉంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఇప్పుడు ఈ ఆస్థి మొత్తం ఆమె ఒక్కగానొక్క కొడుకుకు రాసిందేమో అని అనుకున్నారు. కానీ విజయ నిర్మల ఆమె ఆస్తిని కొడుకుకు మాత్రమే రాయలేదు. ఆమెకు ఇద్దరు మనువళ్లు ఉన్నారు. ఈ ఆస్థి మొత్తం ఆమె ఇద్దరు మనువళ్ళకు సమానంగా చేరేలా రాసింది. అలాగే తన ఫార్మ్ హౌస్ ను మహేష్ బాబుకు చెందేలా రాసింది. మహేష్ బాబు అంటే విజయ నిర్మలకు చాలా ఇష్టం. చాలాసార్లు మహేష్ ను ఆమె పొగడ్తలతో ముంచేసేది. ఇప్పుడు ఆస్తిలో భాగం ఇచ్చి మహేష్ మీద ఆమెకు ఎంత ప్రేమ ఉందొ మరొకసారి తెలియజేసింది. విజయనిర్మల నటిగా, దర్శకురాలిగానే కాదు, కుటుంబ పెద్దగానూ తనదైన ముద్రవేశారు. అప్పట్లో సినిమా షూటింగ్‌లతో కృష్ణ బీజీగా ఉంటే కుటుంబాన్ని ఆమె చూసుకున్నారు. బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించి కథానాయికగా, దర్శకరాలిగా, నిర్మాతగా తన మార్క్ చూపారు. మరి విజయనిర్మల వీలునామా గురించి అలాగే మహేష్ బాబుకు ఆస్తిలో భాగం ఇవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.