అన‌సూయ సంచ‌ల‌న వీడియో వీరిని వ‌ద‌ల‌కండి

469

బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ భ‌రద్వాజ్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే.. ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. హైదరాబాద్ రోడ్లపై నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న ఓ వ్యక్తి వీడియోను ట్వీట్ చేస్తూ.. అతడిపై చర్య తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను కోరారు. సాయంత్రం అనసూయ తన కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 దారిలో ప్రయాణిస్తుండగా.. అదే దారిలో ఓ వ్యక్తి ఇయర్ ఫోన్స్ తగిలించుకొని, సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.

Image result for anusuya

దీనిని గ‌మ‌నించిన అన‌సూయ వెంట‌నే త‌న ఫోన్లో ఆ చిత్రాల‌ను తీసింది.. వీటిని అత‌న ట్వీట్ట‌ర్ లో పోస్టు చేసింది. అలాగే న‌గ‌ర ట్రాఫిక్ పోలీసుల‌కు ట్యాగ్ చేశారు అన‌సూయ‌.డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులూ.. ఇతరుల తప్పిదంతో నేను ఇదివరకే ఒకసారి ప్రమాదం బారిన పడ్డా. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యపు చోదకులను వదిలేయకండి. రోడ్లపై తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించే ఇలాంటి వారికి ఇతరుల ప్రాణాలంటే లెక్క లేదా?’ అని అనసూయ ట్వీట్ చేశారు.

Image result for anasuya bharadwaj

దీనిపై ఆమెకు కూడా కామెంట్లు వ‌స్తున్నాయి మీరు ఈ వీడియో తీసిన స‌మ‌యంలో స్టీరింగ్ ప‌ట్టుకున్నారా వ‌దిలేశారా.. అంటూ కామెంట్లు వ‌స్తున్నాయి.. ఇక దీనికి స‌మాధానంగా నాకు డ్రైవింగ్ రాదు అని స‌మాధానం చెప్పింది ఈ అమ్మ‌డు.

Image result for anasuya bharadwaj
కాని అన‌సూయ ట్వీట్ లో ఆ వ్య‌క్తి ఫేస్ మాత్ర‌మే క‌నిపిస్తోంది.. ఇక అత‌ని కారు నెంబ‌ర్ ఆమె తెలియ‌చేయ‌లేదు..దీంతో ఆకారు నెంబ‌ర్ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోనున్నారు.. మొత్తానికి అన‌సూయ‌కు గ‌తంలో జ‌రిగిన ప్ర‌మాదంతో ఇలా రోడ్ల ప్ర‌మాదాల‌పై ప్ర‌జ‌ల‌ను బాగానే ఎడ్యుకేట్ చేస్తోంది అని కామెంట్లు వ‌స్తున్నాయి.