మెగాస్టార్ పై ద‌ర్శ‌కుడు దారుణమైన విమ‌ర్శ‌లు

412

మ‌మ్ముట్టి మాలీవుడ్ లో ఎంత పెద్ద స్టారో తెలిసిందే.. ఆయ‌న సినిమాల‌కు మాలీవుడ్ లో ఉన్న క్రేజ్ తెలుసు.. భారీ ఓపెనింగ్స్ ఇవ్వ‌డంలో ఆయ‌న సినిమాలు ఇప్ప‌టికీ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటాయి.. అయితే అలాంటి మెగాస్టార్ మ‌మ్ముట్టిపై ద‌ర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెనుదుమారం అవుతున్నాయి.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పెరాన్బు సినిమా టీజర్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్‌ చేసిన కామెంట్స్‌ అసహ్యంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. టీజర్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్‌, పెరాన్బు సినిమాలో మమ్ముట్టి నటనను కీర్తించారు.

Image result for Mammootty

సినిమాలో మమ్ముట్టి కాకుండా మరొకరు నటించి ఉంటే ఓవర్‌ యాక్షన్‌ చేసేవారు. కాని ఈ సినిమాలో మమ్ముట్టి చాలా బాగా నటించారు అని ముందుబాగానే పొగిడారు.. ఇక ఆయ‌న్ని ప్రేక్షకులు చూస్తూ ఉండిపోతారు… నేను వయసులో ఉండి, మమ్ముట్టి ఆడపిల్ల అయి ఉంటే ఆయన్ని అత్యాచారం చేసేవాణ్ని.. అసభ్యంగా మాట్లాడుతున్నానని అనుకోకండి. మమ్ముట్టి నటన గురించి మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఇలా మాట్లాడాను అంటూ మిస్కిన్ సర్థి చెప్పే ప్రయత్నం కూడా చేశారు… అయితే మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… అంతటి గొప్ప నటుడ్ని పొగిడేందుకు ఇలాంటి తేడా వ్యాఖ్యలు చేయటంపై ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

Image result for Mammootty

ఇక పోలిక పోల్చ‌డం రానివారికి మైక్ ఇస్తే ఇలాగే ఉంటుంది అని విప‌రీతంగా సోష‌ల్ మీడియాలో ట్రోల్ మొదలైంది… ద‌ర్శకుడు మిస్కిన్ వ్యాఖ్య‌లు అపార్దం చేసుకోవద్దు అనిచెబుతున్నా, అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.